తెలంగాణ ఎన్నికలు : అసలు పేరు ఒకటి, వాడుకలో మరొకటి.. అభ్యర్థుల నామినేషన్లలో విచిత్రాలు...

By SumaBala Bukka  |  First Published Nov 18, 2023, 8:20 AM IST

అసలు పేరు ఒకటైతే కొసరు పేర్లతో ప్రసిద్ధి చెందుతుంటారు కొంతమంది. ముఖ్యంగా సెలబ్రిటీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన రాజకీయనాయకులు కూడా దీనికి తీసిపోలేదు. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంలో పోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక విచిత్రమైన విషయం వెలుగు చూసింది. నామినేషన్ పత్రాలలో.. పేర్కొన్న పేర్లతో చూస్తే వీరెవరు కొత్తవారా అనుకునేట్లుగా ఉన్నాయి కొంతమంది ప్రముఖుల పేర్లు.  వారి అసలు పేరు ఒకటి కాగా, వాడుకలో ప్రాచుర్యంలో ఉన్న పేరు మరొకటి.  ఇలాంటి వారిలో ప్రముఖంగా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మధు యాష్కి,  పద్మాదేవేందర్ రెడ్డిలు.

రసమయి బాలకిషన్గా అందరికీ పరిచితుడైన బిఆర్ఎస్ అభ్యర్థి అసలు పేరు ఇరుకుల బాలకిషన్.  తెలంగాణ ఉద్యమ సమయంలో,  తెలంగాణలో రసమయి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి.. కృషి చేయడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయి రసమయి బాలకిషన్గా ప్రసిద్ధి చెందారు.

Latest Videos

undefined

టాప్ స్టోరీస్ : ఏపీ, తెలంగాణల్లో ఉద్యోగ హామీలు.. ఫిబ్రవరి 1న గ్రూప్ వన్ నోటిఫికేషన్, ఏపీలో 8.080 మందికి ఉపాధి

ఇక ములుగు కాంగ్రెస్ అభ్యర్థి  సీతక్క. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ.  ఈ పేరు కొంతమందికి తెలుసు. ధనసరి అనసూయ సీతక్కగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే నక్సలిజంలో ఉన్నప్పుడు ఆమె సీతక్కగా పేరుపొందింది, ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి మారిపోయి, రాజకీయాల్లోనూ అదే పేరుతో కొనసాగుతున్నారు.

 బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిది కూడా ఇలాంటి కథనమే. ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ అనే పేరుతో ఎక్కువమంది కనిపిస్తుండడం తెలిసిందే. దీంతో ఆయన పేరు ఆయన స్వగ్రామమైన బాన్సువాడ మండలం పోచారం గ్రామం పేరుతో ముడిపెట్టారు. దీంతో స్వగ్రామమే ఇంటిపేరుగా మారి పోచారం శ్రీనివాస్ రెడ్డి అయ్యారు.

జగిత్యాల బిజెపి అభ్యర్థి బండారు శ్రావణి. ఈమె ఎవరో  తెలియదు అనుకుంటున్నారా?  భోగ శ్రావణి… అంటే గుర్తు పట్టేలా ఉంది కదా… వీరిద్దరూ ఒకటే..అసలు పేరు బండారు శ్రావణి. అత్తగారి ఇంటి పేరు భోగ.  దీంతో ఆమె బోగ శ్రావణిగా వాడుకలో ఉన్నారు. నామినేషన్ పాత్రలో మాత్రం బండారు శ్రావణి గానే దాఖలు చేశారు.

ఇక చివరగా పద్మాదేవేందర్ రెడ్డి. ఆమె మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి. ఆమె అసలు పేరు మాధవ రెడ్డి గారి పద్మ. కానీ రాజకీయాల్లో పద్మా దేవేందర్ రెడ్డిగా గుర్తింపు పొందారు. 


 

click me!