తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికకు నోటీఫికేషన్ జారీ

Siva Kodati |  
Published : May 05, 2021, 03:37 PM IST
తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికకు నోటీఫికేషన్ జారీ

సారాంశం

తెలంగాణలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇటీవల రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి

తెలంగాణలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇటీవల రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

ఇక గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లకు ఈ నెల 7న ఎన్నిక జరగనుంది. అదే రోజు అచ్చం పేట్, సిద్ధిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి.

వీరంతా మే 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి పరిశీలకులను నియమించారు తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కేసీఆర్.  ఎన్నిక‌ల‌ పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్జ‌ర్వ‌ర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్ల‌ను, డిప్యూటీ మేయర్ల‌ను, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల‌ని సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్