తెలంగాణలో లాక్‌డౌన్‌ అవసరం లేదు: సీఎస్ సోమేష్ కుమార్

By narsimha lodeFirst Published May 5, 2021, 3:21 PM IST
Highlights

వీకేండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్ అవసరం లేదన్నారు. భవిష్యత్తులో కూడ వస్తోందని అనుకోవడం లేదన్నారు. 

హైదరాబాద్: వీకేండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్ అవసరం లేదన్నారు. భవిష్యత్తులో కూడ వస్తోందని అనుకోవడం లేదన్నారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ పై సీఎం సరైన సమయలలో నిర్ణయం తీసుకొంటారని ఆయన తెలిపారు. కరోనా విషయంలో హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకొంటామన్నారు. లాక్ డౌన్ కంటే మంచి చికిత్స అందించడం ముఖ్యమన్నారు. లాక్‌డౌన్ పెట్టినా అప్పుడు పెద్ద తేడా ఉండదన్నారు. 

also read:కరోనా కంట్రో‌ల్‌లోనే, భయం వద్దు: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహస్తామన్నారు. అంతేకాదు మెడికల్ కిట్స్ ఇంటికే పంపుతామని ఆయన తెలిపారు. ప్రజల ఉపాధి విషయాన్ని కూడ తాము పరిగణనలోకి తీసుకొంటామన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు త్వరలోనే వస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో అవసరాల్ని బట్టి లాక్ డౌన్ పెట్టుకొన్నాయన్నారు.రాష్ట్రంలో పరిస్థితి కంట్రోల్ లోనే ఉందన్నారు. 


 

click me!