రేపటి నుంచి తెలంగాణ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

Published : Sep 19, 2023, 04:37 PM IST
 రేపటి నుంచి తెలంగాణ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనసంగతితెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 పోస్టులను టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (Telangana TRT 2023) ద్వారా భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనసంగతితెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 పోస్టులను టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (Telangana TRT 2023) ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి(ఈ నెల 20) నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 21ని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు.  

ఇక, 5,089  ఖాళీల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ 1,739, లాంగ్వేజ్ పండిట్‌ 611, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2,575 చొప్పున పోస్టులు ఉన్నాయి. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 

హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జిల్లాల వారీగా ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ వివరాలు https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యుఎస్‌ కోటా అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు. అప్లికేషన్‌ ఫీజును రూ.1000గా నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కోసం వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు వేర్వేరు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే