Vikarabad: వికారాబాద్ పరిధిలో చోటుచేసుకున్న హత్యకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాగిన మైకంలో భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే వారు మృతునిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడని విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్నామనీ, నిందితులను సైతం అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
Extramarital affair-Murder: వికారాబాద్ పరిధిలో చోటుచేసుకున్న హత్యకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాగిన మైకంలో భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే వారు మృతునిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడని విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్నామనీ, నిందితులను సైతం అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... బీహార్‌కు చెందిన అక్షయ్ బింద్ తన భార్య గుడియా దేవిలు పనికోసం వచ్చి వికారాబాద్ సమీపంలోని చాకలిగుట్ట తాండాలో నివాసముంటున్నారు. ఇద్దరూ కూడా స్థానికంగా ఉన్న ఒక ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, అక్షయ్ బింద్ కు దూరపు బందువైన బీహార్ లోని బాక్సర్ జిల్లా బాషీ గ్రామానికి చెందిన తరుణ్ చౌదరి(41) మేకగూడ శివారులోని ఓ గోదాంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా చాకలిగుట్ట తండాలో నివాసం ఉంటున్నాడు.
undefined
ఇద్దరూ దూరపు బంధువులు కావడంతో తరుణ్ చౌదరి తరచుగ్ అక్షయ్ బింద్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే తరుణ్ చుగ్ చౌదరికి, అక్షయ్ బింద్ భార్య గడియా దేవితో అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఈ విషయం అక్షయ్ బింద్ కు తెలియడంతో భార్యను మందలించాడు. ఇంకోసారి ఇలా చేస్తే ఇరువురి ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, గురువారం రాత్రి అక్షయ్ సింగ్ ఇంటికి మద్యం తీసుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి మద్య తాగారు. మద్యం మత్తులో ఉన్న తరుణ్ చుగ్ చౌదరి గుడియా దేవితో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇది చూసిన అక్షయ్ సింగ్.. ఆగ్రహానికి గురై తరుణ్ చుగ్ పై దాడి చేశాడు. అతని భార్యకూడా సహకారం అందించడంతో ఇద్దరు కలిసి అతన్ని తీవ్రంగా కొట్టారు. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. ఇంతా చేశాక, తమకు ఏమీ తెలియనట్టు షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే తరుణ్ చుగ్ చౌదరి చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. నిందితులైన ఇద్దరు భార్యభర్తలు అక్కడి నుంచి పారిపోవడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. కేసు నమోదుచేసుకుని వారి కోసం గాలింపు చేపట్టగా, శనివారం ఉదయం నందిగామ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారణ జరపగా చేసిన నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు.