మెదక్ ఎస్పీ చెప్పిందివిని ఆశ్చర్యపోయా..: కేసీఆర్ సర్కార్ పై డిజిపి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

Published : Aug 18, 2023, 04:10 PM IST
మెదక్ ఎస్పీ చెప్పిందివిని ఆశ్చర్యపోయా..: కేసీఆర్ సర్కార్ పై డిజిపి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

సారాంశం

తెలంగాణ పోలీస్ శాఖకు కేసీఆర్ సర్కార్ ఎంతగానో ప్రోత్సహిస్తోందని... ఇంతలా సహకారం ఏ రాష్ట్రంలో లేదని డిజిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ : కేసీఆర్  సర్కార్ పై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ప్రశంసలు కురిపించారు. పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహయసహకారాలు అందిస్తోందని పోలీస్ బాస్ అన్నారు. చాలా రాష్ట్రాల్లో చిన్నచిన్న పనులకు కూడా నిధులు లేక  పోలీస్ శాఖ ఇబ్బంది పడుతోందని... తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ప్రోత్సహిస్తోందని... ఇక్కడ విధులు నిర్వహించడం మన అదృష్టమని డిజిపి అన్నారు. 

మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రోహిణితో మాట్లాడినట్లు డిజిపి తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు కాబట్టి అందుకోసం జరుగుతున్న ఏర్పాట్లు గురించి చర్చించానని అన్నారు. అయితే ఈ కార్యాలయం కూడా అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఏ 25 లేదా 30 ఎకరాల్లో వుంటుందని భావించానని... కానీ ప్రభుత్వం ఏకంగా 62 ఎకరాల కేటాయించినట్లు తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఇది ఎవ్వరూ ఊహించివుండరని అన్నారు. 

వీడియో

దేశంలో ఆ చివరనున్న కశ్మీర్ నుండి ఈ చివరనున్న కన్యాకుమారి వరకు వెతికినా ఎక్కడా ఓ జిల్లా పోలీస్ కార్యాలయం కోసం ఇంత భూమి కేటాయించడం జరిగివుండదని అన్నారు. అలాగే 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైక్వాలిటితో  అద్భుతమైన ఎస్పీ కార్యాలయ భవనం నిర్మించారని అన్నారు.  ఇది చాలు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖను ఎంతలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి అని డిజిపి అజనీ కుమార్ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu