Telangana: ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌తో చీక‌టి రోజు.. స్పీకర్ నిర్ణయం పై బీజేపీ ఎమ్మెల్యేల ఫైర్ !

Published : Mar 15, 2022, 04:02 PM IST
Telangana: ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌తో చీక‌టి రోజు.. స్పీకర్ నిర్ణయం పై బీజేపీ ఎమ్మెల్యేల ఫైర్ !

సారాంశం

Telangana:  బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్ పై స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని బీజేపీ నేత‌లు త‌ప్పుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అధికార పార్టీ వారి అహంకారాన్ని బొందపెట్టే రోజు వస్తుందంటూ మండిపట్టారు.   

Telangana: తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు సూచనతో స్పీకర్ ను కలిశారు. తమపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌రావు స్పీకర్‌ను కోరారు. అయితే, తమను సభలోకి అనుమతించాలని వారు కోరగా.. స్పీకర్ నిరాకరించారు. సభ తీసుకున్న నిర్ణయం దాటి తానేమీ చేయలేనని, సభలోకి అనుమతించబోనని స్పష్టం చేశారు. వారిని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి కూడా అనుమతి నిరాకరించారు. 

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.. ఈ నెల 17 న ఇందిరా పార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో మా సీటు నుండి ఒక్క అడుగుకూడ కదలలేదనీ, అసెంబ్లీలో ఎలాంటి ఆందోళన చేయలేదు అని ఈ రోజు స్పీకర్ గారి ముందు మా వాదన వినిపించామని తెలిపారు. 

వారి అహంకారాన్ని బొందపెట్టే రోజు వస్తుంది: ఈటల రాజేందర్

మన దేశంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు, బాధ్యతలు అన్నీడాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలేన‌ని అన్నారు. ఆ పదవులు అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయ‌ని తెలిపారు. స్పీకర్ చైర్ కు విలువ ఇస్తూ కోర్టు గౌరవ సూచన ఇచ్చింది. కానీ ఆ స్పూర్తిని తుంగలో తొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తార‌ని విమ‌ర్శించారు. స్పీకర్ తన గౌరవాన్ని నిలుపుకోలేక పోవడం దురదృష్టకర‌మ‌నీ, ఈ పద్దతి నిరంకుశత్వానికి దారి తీస్తుంద‌ని అన్నారు. తాను 25 సంవత్సరాలుగా ఈ సభలో అనేకమంది స్పీకర్లు, సీఎంలను చూశాన‌నీ, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పారు. మా సస్పెన్షన్ పై సభ అభిప్రాయం మళ్లీ తెలుసుకోమని కోరినా కూడా స్పందించలేదని అన్నారు. 

ఈ విధానాలు చూస్తే నార్త్ కొరియా గుర్తు వస్తుంది. అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లుకొట్టలేదని అని ఒక సభ్యున్ని కాల్చి చంపారు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టలేదు అని కూడా సస్పెండ్ చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.  "నేను ఒక ఉద్యమ నాయకున్ని,  ఉద్యమాన్ని తూలనాడిన వారితో మమ్మల్ని సస్పెండ్ చేయించడం మరింత అవమానకరం. సీఎం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టు ఉంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చాలి అని సీఎం కోరడం ఇందుకేనేనో అని పిస్తోంది. ఈ స్పీకర్, కోర్టు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు అనుకున్నట్టు ఉంది" అని ఆరోపించారు.  

ఉద్దేశ‌పూర్వ‌కంగానే స్పీక‌ర్ మౌనం : రఘునందన్ రావు

హైకోర్టు ఉత్తర్వులు, మీ అభ్యర్థనను పూర్తిగా పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నా అని స్పీకర్ చెప్పార‌ని ర‌ఘునంద‌న్ రావు అన్నారు. మా అభ్యర్థనను సభానాయకుడు ముందు ఉంచి,  సభలో చర్చ చేసి నిర్ణయం తీసుకోండి అని కోరినా కూడా స్పీకర్ వినలేదని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమ‌నీ, ప్రజాస్వామ్య చరిత్రలో చీక‌టి రోజు అని పేర్కొన్నారు. స్పీకర్ ఉద్దేశ‌పూర్వకంగా మౌనంగా వ్యవహరించారు. తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారు అని ఆరోపించారు. 1997 లో వాజ్‌పేయి మాట‌ల‌ను గుర్తుచేస్తూ.. ఒక రోజు వస్తుంది ఆ రోజు మిమ్ముల్ని చూసి నవ్వుకుంటారు అన్నారు. ఆ మాటలు కేసిఆర్ గారికి గుర్తు చేస్తున్నా.. అని రఘునందన్ రావు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!