తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Published : Mar 15, 2022, 03:55 PM IST
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ మంగళవారం నాడు మధ్యాహ్నం నిరవధికంగా వాయిదా పడింది. ఏడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఈ నెల 7వ తేదీన Telangana Assembly బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 54 గంటల 47 నిమిషాల  పాటు అసెంబ్లీ పని చేసింది.మొత్తం 4 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ద్రవ్య వినిమయ బిల్లును ఇవాళ సీఎం KCR సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఇతర పార్టీల సభ్యులు  సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !