‘జైభీమ్‌’... సూర్యాపేటలో గిరిజనుడిపై థర్డ్ డిగ్రీ...

By AN TeluguFirst Published Nov 12, 2021, 10:18 AM IST
Highlights

విషయం తెలుసుకున్న తండావాసులు సుమారు 200 మంది గురువారం ఉదయం ఠాణాను ముట్టడించారు. వీరశేఖర్ ను చిత్రహింసలకు గురి చేయడానికి కారణాలు  చెప్పాలంటూ  ఎస్ఐ లింగయ్యను నిలదీశారు.

ఆత్మకూరు :  సూర్యాపేట జిల్లా లో  ‘జై భీమ్’ సినిమా తరహా దారుణం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని స్టేషన్ కు పట్టుకొచ్చిన పోలీసులు అతనిపై దారుణంగా థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారు. ‘అంతగా కొడితే  గుండె ఆగదా?’  అంటూ  అడ్డ గూడూరు లో మరియమ్మ లాకప్ డెత్ పై, మంథనిలో  శీలం రంగయ్య  లాకప్ డెత్ పై హైకోర్టు ధర్మాసనం పోలీసుల తీరును ఎండగట్టిన రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే..  ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన  గూగులోతు భీంసింగ్, కీరి దంపతుల కుమారులు వీరన్న (23),  వీర శేఖర్ (21)  పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బుధవారం ఉదయం వీరిద్దరు తమ పొలం పనుల్లో తలమునకలై ఉండగా..  మఫ్టీలో వచ్చిన పోలీసులు.. 
Veera Shekharను పట్టుకున్నారు. తన తమ్ముడిని ఎందుకు తీసుకెళ్తున్నారని వీరన్న ప్రశ్నించగా పోలీసులు సమాధానం చెప్పలేదు. దాంతో కుటుంబసభ్యులు, తండా పెద్దలతో కలిసి ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్కు వెళ్లారు.

అప్పటికే పోలీసులు Third degree ప్రయోగించిన ఆనవాళ్లు కనిపించడంతో ఎస్ఐ లింగయ్య నిలదీశారు. రేపు రావాలంటూ ఎస్ఐ చెప్పడంతో... అన్యమనస్కంగానే వెళ్ళిపోయారు.  రాత్రి 11:30 గంటల సమయంలో వీరన్నకు  పోలీసులు  ఫోన్ చేసి,  వీరశేఖర్ ను తీసుకెళ్లాలని సూచించారు.  అర్ధరాత్రి 12 గంటల సమయంలో Police Stationకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న వీరశేఖర్ ను ఇంటికి తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న తండావాసులు సుమారు 200 మంది గురువారం ఉదయం ఠాణాను ముట్టడించారు. వీరశేఖర్ ను చిత్రహింసలకు గురి చేయడానికి కారణాలు  చెప్పాలంటూ  ఎస్ఐ లింగయ్యను నిలదీశారు. ఓ దశలో ఎస్సై పై దాడికి ప్రయత్నించారు.  పోలీసుల నుంచి సమాధానం రాకపోవడంతో..  వీర శేఖర్ ని తీసుకుని సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలోని తేల్చుకుంటామని ట్రాక్టర్లలో బయలుదేరారు.

సిరిసిల్లలో ఉద్రిక్తత... బారికేడ్లను లాగేసి, పోలీసులను తోసుకుంటూ... కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఆందోళన

విషయం తెలుసుకున్న Suryapeta Rural Police వారిని కుడకుడ వద్ద అడ్డుకున్నారు.  దీంతో పోలీసులు,గిరిజనుల మధ్య తోపులాట జరిగింది.  ఆ ప్రాంతానికి మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.  వీర శేఖర్ చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించి..  ఆత్మకూర్ (ఎస్) ఠాణాకు తిరిగి చేరుకున్న గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.  సూర్యాపేట రూరల్ సిఐ విట్టల్ రెడ్డి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

అయినా వినకపోవడంతో... ఎస్సై పై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హామీ ఇచ్చారు.  దాంతో తండావాసులు ఆందోళనను విరమించారు.  ఆస్పత్రి వద్ద వీరశేఖర్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ..  తాను దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా తనపై దాడి చేశారన్నారు.  కాళ్లు కట్టేసి.. బాగా కొట్టారు అని చెప్పాడు.  ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

థర్డ్ డిగ్రీ కి కారణం ఇదే …
మండలంలోని ఏపూరులోని ఓ బెల్ట్ షాప్ లో జరిగిన Theft వీరశేఖర్ మెడకు చుట్టుకుంది.  ఈ నెల 5న ఆ Belt shopల్లో చోరీ CCTV cameras ఫుటేజీతో రామోజీ తండాకు చెందిన భూక్యా నవీన్ అనే యువకుడు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో అతడు ఓ ఇరవై మంది పేర్లను చెప్పాడని, వారందరి విచారణలో భాగంగానే వీరశేఖర్ ను విచారించాలని ఎస్సై లింగం తెలిపారు. అయితే అప్పటికే వీరశేఖర్ పక్షవాతంతో బాధపడుతున్నాడని గుర్తించామన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగి ఇంటికి పంపమని... చోరీ కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులంతా ఈ ఆందోళనకు తెరలేపారని ఆరోపించారు.

ఆ ఎస్ ఐ ఎక్కడికి వెళ్ళినా అదే తీరు
జిహెచ్ఎంసి పరిధిలోని  ఉప్పల్ పిఎస్ లో ఇలాంటి ఘటనలతోనే  ఎస్సై లింగయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తరువాత అతను సూర్యాపేట జిల్లాలో పోస్టింగ్ వేయించుకున్నాడు.  సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐగా పనిచేస్తూ లాఠీకి ఇష్టారాజ్యంగా పని చెప్పాడు.  ఓ వ్యక్తిని  చితకబాదడంతో  బాధితుడు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్, కోవిడ్ కల్లోల సమయంలో  ఓనర్స్ ఆసుపత్రిలో పెట్టేందుకు వెళ్తుండగా ఆమె భర్తపై లాఠీ జరిపించాడు.

అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. నర్సులంతా విధులకు హాజరయ్యేది లేదంటూ ఆందోళన చేపట్టారు. ఫలితంగా లింగయ్యను వీఆర్‌(వెకన్సీ రిజర్వ్‌) కింద పెట్టారు. ఆత్మకూరు పిఎస్ కు బదిలీ అయిన ఎస్సై లింగం..  ఇసుక కాంట్రాక్టర్లకు వంత పాడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లాడనే కక్షతో ఆత్మకూర్‌(ఎస్‌) ఒకటో వార్డు సభ్యుడు ఆవుల సింహాద్రిపై అక్రమ కేసులు బనాయించారు. 

click me!