తెలంగాణలో ఆందోళనకరంగా కరోనా కేసులు... రికవరీల కంటే పాజిటివ్ కేసులే అధికం

By Arun Kumar PFirst Published Oct 9, 2020, 11:47 AM IST
Highlights

తాజాగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో ఆందోోళనకర విషయాలు బయటపడ్డాయి. 

హైదరాబాద్: తాజాగా వెలువడిన తెలంగాణలో  కరోనా బులెటిన్ రాష్ట్ర ప్రజల్లో ఆందోళనను రేకెత్తించేలా వుంది. గతకొద్దిరోజులుగా కరోనా కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా వుండగా గత 24గంటల్లో రికవరీల కంటే పాజిటివ్ కేసుల ఎక్కువగా వుండటం ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన ప్రకారం గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,891కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. 

అయితే ఇప్పటికే కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 1,878 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 1,80,953కి చేరింది. 

read more   తెలంగాణ కరోనా అప్ డేట్... హైదరాబాద్, రంగారెడ్డి పోటా పోటీ

కాస్త ఊరటనిచ్చే అంశమేంటంటే రాష్ట్రంలో గత 24గంటల్లో అతి తక్కువగా కేవలం ఏడుగురు మాత్రమే మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 1208కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.57శాతం, రికవరీ రేటు 86.77శాతంగా వుంది. 

ఇక జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) 285, మేడ్చల్ లో 195, రంగారెడ్డి లో 175, నల్గొండలొ 128 కేసులు నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 65, కరీంనగర్ 97, ఖమ్మం 72, సిద్దిపేట 64, వరంగల్ అర్బన్ 76 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య నామమాత్రంగా వుంది. 
 

click me!