తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు...

Published : May 01, 2021, 11:07 AM IST
తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు...

సారాంశం

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,930 పరీక్షలు నిర్వహించగా.. 7,754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,930 పరీక్షలు నిర్వహించగా.. 7,754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.

మరోవైపు కోవిడ్ తో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,312 గా ఉంది. ఇక కరోనాను తాజాగా 6,542 మంది జయించగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు నిర్థారణ అయ్యాయి. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!