మే 3 తరువాత కరోనా కేసులు తగ్గేవరకు ఎన్నికలు పెట్టొద్దు.. హైకోర్టు

By AN TeluguFirst Published May 1, 2021, 10:02 AM IST
Highlights

ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత.. కరోనా కేసులు తగ్గే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ కు తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు ఆదేశించారు. 

ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత.. కరోనా కేసులు తగ్గే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ కు తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు ఆదేశించారు. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఏప్రిల్‌ 30తో రాత్రి కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు  ముగుస్తుండటంతో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాలంటూ గతంలో ఆదేశించిన నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.

ఈ విచారణ సమయంలో  తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.  ఇవాళ  కేసు విచారణను 45 నిమిషాల విచారణకు బ్రేక్ ఇచ్చిన తర్వాత హైకోర్టు కేసు విచారణను కొనసాగించింది.ఈ సమయంలో మరో వారం రోజుల పాటు  నైట్ కర్ఫ్యూను పొడిగిస్తామని  తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. 

ఇవాళ విచారణ సమయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. తలపై గన్ గురిపెడితే తప్ప నిర్ణయాలు తీసుకోరా అని హైకోర్టు ప్రశ్నించింది.  ప్రభుత్వం నిర్ణయం  తెలపకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని హైకోర్టు అభిప్రాయపడింది. 

రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా అని హైకోర్టు అడిగింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయని  తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  ఈ విషయమై విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. 

కాగా తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ప్యూను మే 8వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో  ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో   ఈ నెల 20 నుండి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.

click me!