గుడివాడ నుంచి పోటీకి ఆహ్వానం వుంది: బాంబు పేల్చిన రేణుకా చౌదరి, ఏ పార్టీ నుంచో.. రాజకీయ వర్గాల్లో చర్చ

By Siva KodatiFirst Published Feb 6, 2023, 6:52 PM IST
Highlights

టీ.కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గుడివాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆహ్వానం అందిందన్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఆమె చెప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో గొడవలు బాధాకరమన్నారు. చివరికి ఇన్‌ఛార్జి వచ్చి గొడవలు పరిష్కరించాల్సి రావడంపై రేణుకా చౌదరి విచారం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని, ఆయనను ఖమ్మంకు ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు. తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానన్న రేణుకా చౌదరి.. తనకు ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలన్న ఆహ్వానం వుందంటూ బాంబు పేల్చారు. 

ALso REad: పార్లమెంట్‌లోనే ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చారు.. ఖర్గే వ్యాఖ్యలపై దుమారం వేళ రేణుకా చౌదరి ట్వీట్..

అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా అడుగుపెడతారో చూస్తామని ఆమె హెచ్చరించారు. ఎక్కడా దిక్కులేని వాళ్లు కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని.. ఎవరొచ్చినా తాము స్వాగతిస్తామని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరే విషయంపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారని ఆమె వెల్లడించారు. 
 

click me!