ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కేటాయించిన నిధుల కంటే రోడ్లు భవనాల శాఖకు నిధులు కేటాయించినట్టుగా మంత్రి హరీష్ రావు చెప్పారు. రోడ్ల మరమ్మత్తులకే రూ. 2500 కోట్లను కేటాయించామన్నారు.
హైదరాబాద్: కొత్త ఉద్యోగుల వేతనాల కోసం బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయించినట్టుగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
సోమవారంనాడు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగో సారి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖకు రూ. 2500 కోట్ల కేటాయింపులుండేవని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు రూ. 2500 కోట్లు కేటాయించినట్టుగా మంత్రి హరీష్ రావు చెప్పారు. పంచాయితీరాజ్ శాఖకు రూ. 2 ేల కోట్ల కేటాయించినట్టుగా మంత్రి వివరించారు. బీటీ రోడ్లకు గుంతలు లేకుండా ఉండాలనేది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. .
undefined
యూనివర్శిటీల్లో హస్టళ్ల నిర్వహణ, కొత్త హస్టళ్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి తెలిపారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు ఏప్రిల్ నుండి రెగ్యులర్ చేస్తామని మంత్రి ప్రకటించారు. సెర్ఫ్ ఎంప్లాయిస్ కు ఏప్రిల్ నుండి పే స్కేల్ అందించనున్నామని మంత్రి వివరించారు. స్వంత స్థలాలుండి ఇంటి నిర్మాణం చేసుకున్నవారికి ఆర్ధిక సహయం కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించినట్టుగా మంత్రి తెలిపారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి నిధులు నేరుగా గ్రామపంచాయితీ, మున్సిఫల్ శాఖల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు వివరించారు. నిధుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా చూస్తామని మంత్రి హమీ ఇచ్చారు.