Telangana: కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం..పెద్దల సభకు వెళ్తున్నఅనిల్ కుమార్ యాదవ్ ఎవరు ?  

Published : Feb 15, 2024, 07:29 AM IST
Telangana: కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం..పెద్దల సభకు వెళ్తున్నఅనిల్ కుమార్ యాదవ్ ఎవరు ?  

సారాంశం

Telangana: కాంగ్రెస్ పార్టీ హైకమండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఇంతకీ అనిల్ కుమార్ యాదవ్ ఎవరు?  

Telangana: కాంగ్రెస్ పార్టీ హైకమండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను  ఎంపిక చేసింది. అలాగే మధ్యప్రదేశ్ , కర్ణాటకల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో అశోక్ సింగ్ , కర్ణాటకలో అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్‌లను ఎంపిక చేసింది.రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు. 

ఇంతకీ అనిల్ కుమార్ యాద‌వ్ ఎవరు? 

రేణుకా చౌదరి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలి అందరికీ సుపరిచితమే.. లోక్ సభలోనూ.. అటు రాజ్యసభలోనూ పనిచేసింది. అలాగే.. పార్టీలో క్రియశీలకంగా ఉంటూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు రేణుకా చౌదరి. ఇక్కడి వరకూ అంత ఓకే ఉన్నా.. రాజ్యసభ రేసులో ఎంతో మంది సీనియర్ నాయకులు భారీలో ఉండగా.. ఎవరు ఊహించని విధంగా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మాజీ ఎంపీ అంజ‌న్‌కుమార్ యాద‌వ్ కుమారుడైన అనిల్ కుమార్ యాద‌వ్‌. 2013లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు.  విద్యార్థి ద‌శ నుంచే ఆయన కాంగ్రెస్‌తో క‌లిసి అడుగులేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఉపాధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. త‌ర్వాత యువ‌జ‌న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడ‌య్యారు. ప్ర‌స్తుతం యువ‌జ‌న కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా పనిచేశారు.

వాస్తవానికి అనిల్ కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్.. ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. అయినా.. పార్టీనే నమ్ముకుని యాక్టివ్ కార్యకర్తగా అనిల్ కుమార్ యాదవ్‌ పనిచేశారు.ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ హైకమాండ్ తనకు ఏకంగా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించింది. 

ఈ సందర్భంగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ అవకాశం ఇస్తారని జీవితంలో ఊహించలేదన్నారు. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయని చెప్పడానికి తానే నిదర్శనమని, తనలాంటి యువకుడికి అధిష్ఠానం.. పెద్దలసభకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమేనని పేర్కొన్నారు. కొత్తరక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యమని, ఇందుకు  ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్‌, తనకు రాజ్యసభ కు పంపించడమేనని చెప్పారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!