ధరఖాస్తు చేసుకోకున్నా అలాంటి వారికి టిక్కెట్లు: ఆ 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

By narsimha lode  |  First Published Sep 3, 2023, 5:09 PM IST


ఎలాంటి ఇబ్బందులు లేని  స్థానాల్లో అభ్యర్థుల పేర్లను  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీకి  పంపనుంది ఎన్నికల కమిటీ.
 


హైదరాబాద్: ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరే వారికి ఆ పార్టీ టిక్కెట్లు కేటాయించనుంది.  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు  ధరఖాస్తు  చేసుకొనేందుకు గడువు కూడ ముగిసింది.  దీంతో  ఇతర పార్టీల నుండి  కాంగ్రెస్ లో చేరే వారికి  పోటీ చేసేందుకు  టిక్కెట్లు కేటాయింపులో ఇబ్బందులు లేవు.  బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా  ఉన్న  ఖానాపూర్ ఎమ్మెల్యే  రేఖానాయక్  కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు  చేసుకుంది. కానీ, ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా  ఉన్న వారితో  ఆ పార్టీ నేతలు  సంప్రదింపులు జరుపుతున్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన  నేతలు  తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరుపుతున్నారు.  మరో వారం రోజుల్లో  తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే తుమ్మల నాగేశ్వరరావుకు  ఆ పార్టీ టిక్కెట్టు దక్కనుంది.  ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కూడ  తమకు టిక్కెట్టు కేటాయించాలని కోరుతూ  ధరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  ప్రత్యేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ  ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టిక్కెట్ల కేటాయింపు విషయంలో నిర్ణయం తీసుకుంటుంది.  

Latest Videos

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేయనుంది.  తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తే షర్మిలకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు విషయంలో  ఆ పార్టీ  కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. 

బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో  కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారు.  తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.  అయితే  వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయింపు విషయమై  ఆ నేతలు  కాంగ్రెస్ నేతల నుండి హామీ కోరుతున్నారు. అయితే  అలాంటి నేతలకు  టిక్కెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నేతలు  హామీలు ఇస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం  గత నెల  18 నుండి  25 వ తేదీ వరకు  1006 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి  సీనియర్లతో పాటు  ఇతరులు కూడ  టిక్కెట్లు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  ఇవాళ  భేటీ కానుంది. రేపటి నుండి  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీతో సమావేశం నిర్వహించనుంది.

also read:నేడే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ: 530 మందితో ఆశావాహుల జాబితా

ఇదిలా ఉంటే  పోటీ తీవ్రంగా లేని, ఒకే ధరఖాస్తు వచ్చిన  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అభ్యర్థుల ఎంపిక లాంఛనప్రాయమే. అయితే ఆ అభ్యర్థుల పేర్లను స్క్రీనింగ్ కమిటీ  ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. 

ఒకే పేరుతో ధరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలు

కొడంగల్-రేవంత్ రెడ్డి
సంగారెడ్డి- జగ్గారెడ్డి
కామారెడ్డి- షబ్బీర్ అలీ
భద్రాచలం-పోడెం వీరయ్య
నాగార్జునసాగర్- కుందూరు జయవీర్ రెడ్డి
నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆలంపూర్- సంపత్ కుమార్
మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు
ఆంథోల్-దామోదర రాజనర్సింహ
పరిగి-రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్-గడ్డం ప్రసాద్
ఇబ్రహీంపట్టణం-మల్‌రెడ్డి రంగారెడ్డి
ఆలేరు-బీర్ల అయిలయ్య
దేవరకొండ-వడ్త్య రమేష్ నాయక్
వేములవాడ-ఆది శ్రీనివాస్
ధర్మపురి-లక్ష్మణ్
పరకాల-ఇనగాల వెంకట్రామిరెడ్డి
హుజూర్ నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ-పద్మావతి
మధిర-మల్లు భట్టివిక్రమార్క
మంథని-శ్రీధర్ బాబు
జగిత్యాల-జీవన్ రెడ్డి
ములుగు-సీతక్క
హుజూరాబాద్-బల్మూరి వెంకట్
వేములవాడ-ఆది శ్రీనివాస్
 

click me!