హైదరాబాద్‌లో దారుణం.. అక్కాతమ్ముడిపై కత్తితో దుండగుడి దాడి, తమ్ముడు మృతి

Siva Kodati |  
Published : Sep 03, 2023, 04:32 PM ISTUpdated : Sep 03, 2023, 04:58 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. అక్కాతమ్ముడిపై కత్తితో దుండగుడి దాడి, తమ్ముడు మృతి

సారాంశం

హైదరాబాద్ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో  ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి.. లోపల వున్న అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు . ఈ ఘటనలో తమ్ముడు చింటూ ప్రాణాలు కోల్పోయాడు. 

హైదరాబాద్ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ‌దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి.. లోపల వున్న అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తమ్ముడు చింటూ ప్రాణాలు కోల్పోయాడు. అక్క సంఘవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దుండగుడిని పట్టుకున్న స్థానికులు అతనిని ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనను పోలీసులు ప్రేమోన్మాది దాడి ఘటనగా నిర్ధారించారు. సంఘవి, రామంతాపూర్‌ చెందిన నిందితుడు శివకుమార్‌ల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఈరోజు మధ్యాహ్నం ఇంటికొచ్చి సంఘవితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ఆమె తమ్మడు పృథ్వీ ఇంట్లోనే వున్నారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో పృథ్వీ, సంఘవీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి గొడవను గమనించిన స్థానికులు శివకుమార్‌ను పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేయగా.. సంఘవి హోమియోపతి చదువుతోంది. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే