కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు.. మరో యాడ్‌తో కాంగ్రెస్ కౌంటర్ (Video)

By Mahesh K  |  First Published Nov 13, 2023, 6:12 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నదని, ప్రజలను రెచ్చగొడుతున్నదని బీఆర్ఎస్ లీగల్ టీం సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్‌ను కించపరిచేలా ఉన్న ఆ యాడ్‌లను వెంటనే నిలిపేయాలని కోరారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అదే యాడ్‌ను కొంత మార్చి ఘాటు క్యాప్షన్‌తో కౌంటర్ ఇచ్చింది.
 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా వినియోగం పతాకస్థాయికి చేరుకుంటున్నది. అన్ని పార్టీలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్న యాడ్స్ షార్ప్‌గా ఉంటున్నాయి. బీఆర్ఎస్‌ను గట్టిగా ఢీకొట్టేలా ఉన్నాయి. ఒకింత ఆ పార్టీ నేతలు అభ్యంతరం పెట్టే స్థాయిలో ఈ యాడ్స్ ఉంటున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు సీఈవో వికాస్ రాజ్‌కు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ యాడ్స్‌ను నిలిపేయడం పక్కనపెడితే.. మరింత వాడిగా రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ వాదనలకు ప్రతిగా మరో యాడ్‌తో కౌంటర్ ఇచ్చింది.

సీఈవోకు బీఆర్ఎస్ లీగల్ టీం మరోసారి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా ఇంకో యాడ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది వరకు వైరల్ అవుతున్న కాంగ్రెస్ యాడ్ వీడియోనే మరోసారి కొన్ని మార్పులతో రీపోస్ట్ చేసింది. ఆ వీడియోలో పైన బ్యాన్‌డ్ అని పేర్కొంది. ఆ వీడియోకు పెట్టిన క్యాప్షన్ మాత్రం బీఆర్ఎస్‌కు మరింత ఆగ్రహం తెప్పించేలాగే ఉన్నది. ‘ఈ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎవరి భావోద్వేగాలు గాయపడలేవు.. కేవలం బీఆర్ఎస్ భావోద్వేగాలు తప్ప’ అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ క్యాప్షన్ పెట్టింది.

Latest Videos

Also Read: బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీ విలీనం!.. లీడర్లు, క్యాడర్‌ను స్వాగతించిన మంత్రి హరీశ్ రావు

No one's sentiment was hurt during making of this Ad except BRS.. pic.twitter.com/Fxy9h6eYAa

— Telangana Congress (@INCTelangana)

కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్‌ను కించపరిచేలా ఉన్నాయని, ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే వాటిని నిలిపేయాలని కోరారు. ఈసీకి చెప్పే వాటికి ప్రచారం చేస్తున్న యాడ్‌లకు పొంతన ఉండటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ యాడ్‌లతో రెచ్చగొట్టడం మానుకునేలా చూడాలని తెలిపారు. ఎందుకంటే ఇది వరకే  పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు జరిగిన ఘటనను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఈ ఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

click me!