మంత్రి పువ్వాడపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాను.. తుమ్మల నాగేశ్వరరావు

By Sumanth Kanukula  |  First Published Nov 13, 2023, 5:03 PM IST

బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్‌ సరైన ఫార్మాట్‌లో లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పువ్వాడ అఫిడవిట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా తుమ్మల చెప్పారు. 


బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్‌ సరైన ఫార్మాట్‌లో లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పువ్వాడ అఫిడవిట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా తుమ్మల చెప్పారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ అఫిడవిట్ సరైన ఫార్మాట్‌లో లేదని అన్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుని రిటర్నింగ్ అధికారి తీరుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. 

పువ్వాడ అజయ్ అఫిడవిట్‌లో డిపెండెంట్ కాలమ్ మార్చారని.. పెండెంట్ కాలమ్‌లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయాల్సి ఉందని, కానీ అలా చేయలేదని చెప్పారు. పువ్వాడ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్లలో తప్పులు ఉన్నాయని ఆరోపించారు. అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్ ఈసీ ఫార్మట్‌లో లేకపోతే నామినేషన్ రిజక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదని.. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. 

Latest Videos

click me!