ముదురుతున్న జలవివాదం: రేపు 1000 మందితో కాంగ్రెస్ ‘‘ చలో రాజోలిబండ ’’

By Siva KodatiFirst Published Jun 23, 2021, 7:28 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. ఆర్డీఎస్‌పై నేతల మాటలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇంతలోనే రేపు చలో రాజోలిబండకు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పిలుపునివ్వడంతో టెన్షన్ నెలకొంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. ఆర్డీఎస్‌పై నేతల మాటలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇంతలోనే రేపు చలో రాజోలిబండకు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పిలుపునివ్వడంతో టెన్షన్ నెలకొంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో అసమర్ధ మంత్రులు వున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జల దీక్ష చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం  నీటి దోపిడి చేస్తున్నా.. తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెయ్యి మందితో కలిసి రేపు చలో రాజోలిబండకు పిలుపునిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా కలిసి రాజోలిబండకు తరలిరావాలని సంపత్ కుమార్ కోరారు. 

అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. సంగమేశ్వర ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో జారీ చేసిందన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా టీఆర్ఎస్ తీరు వుందన్నారు విక్రమార్క. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కట్టి నీళ్లు తీసుకెళ్తుందని గతంలోనే తాము చెప్పామని ఆయన గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేం హెచ్చరించామని విక్రమార్క చెప్పారు.

Also Read:ఏపీ ప్రాజెక్టులపై క్రిష్ణ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు..

తాము ముందే హెచ్చరించినా కేసీఆర్ మొద్దు నిద్ర వీడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఊర్లలో తిరుగుతూ తుపాకీ రామునిలా ప్రగల్భాలు పలుకుతున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలపై నియంత్రణ లేదని ఆయన ఆరోపించారు. సీఎం ట్రీట్‌మెంట్ తీసుకునే ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు లక్షలు ఎలా వసూలు చేస్తోందని విక్రమార్క ప్రశ్నించారు. 

click me!