5 కోట్ల ఎక్స్‌గ్రేషియా.. జ్యూడిషీయల్ విచారణకు డిమాండ్: అడ్డగూడురు లాకప్‌డెత్‌పై హైకోర్టులో పిల్

By Siva KodatiFirst Published Jun 23, 2021, 6:48 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని పిల్‌లో కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని పిల్‌లో కోరారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించారని పిటిషనర్ ఆరోపించారు. మరియమ్మ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అత్యవసరంగా నేడు విచారణ జరపాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే రేపు విచారణ జరిపేందుకు పరిశీలిస్తామని హైకోర్ట్ తెలిపింది. 

Also Read:యాదాద్రి: అడ్డగూడురు లాక‌ప్‌డెత్.. ముగ్గురు పోలీసులపై వేటు

కాగా, అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు. అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య‌లపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురులో పీఎస్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 

click me!