జీవో 111 ఎత్తివేత పరిణామాలపై అధ్యయనం: ఏడుగురితో కాంగ్రెస్ కమిటీ

By narsimha lodeFirst Published May 26, 2023, 1:21 PM IST
Highlights


జీవో  111  ఎత్తివేతపై  చోటు చేసుకొనే పరిణామాలపై  కాంగ్రెస్ పార్టీ  ఏడుగురితో  కమిటీని  ఏర్పాటు  చేసింది.  


హైదరాబాద్:  జీవో  111   ఎత్తివేతతో  చోటు  చేసుకునే పరిణామాలపై   ఏడుగురితో   కమిటీని  ఏర్పాటు  చేసింది  తెలంగాణ కాంగ్రెస్,  మాజీ మంత్రి  కోదండరెడ్డి  నేతృత్వంలో  కమిటీని ఏర్పాటు  చేసింది  కాంగ్రెస్ పార్టీ. జీవో  111  ఎత్తివేతతో  చోటు  చేసుకునే పరిణామాలపై  కమిటీని ఏర్పాటు  చేస్తామని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఇటీవలనే  ప్రకటించిన విషయం తెలిసిందే.

 కాంగ్రెస్  పార్టీ  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం  ఇవాళ  ఉదయం గాంధీ భవన్ లో  ప్రారంభమైంది.  ఈ సమావేశంలో  కమిటీని ఏర్పాటు  చేస్తూ  పార్టీ నాయకత్వం  నిర్ణయం తీసుకుంది.   ఈ కమిటీలో  కోదండరెడ్డితో  పాటు  మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి  జిల్లాలకు  చెందిన   కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. మరో వైపు  ఇద్దరు నిపుణులను  కూడా  కమిటీలో  చేర్చారు. 

ఇదిలా  ఉంటే  జీవో  111   ఎత్తివేతతో  ఈ ప్రాంతంలో  ఎంతమంది  రాజకీయ నేతలకు భూములున్న విషయమై  కూడా  ఈ కమిటీ  సేకరించింది.  జీవో  111  ఎత్తివేత  కారణంగా సామాన్య రైతుల కంటే   బడా రాజకీయ నేతలకు, రియల్ ఏస్టేట్ సంస్థలకు  ప్రయోజనం కలిగే  అవకాశం ఉందనే విమర్శలు  కూడ లేకపోలేదు.

జీవో  111 ఎత్తివేత  కారణంగా  జంట జలాశయాలకు  నష్టం  వాటిల్లే  అవకాశం ఉందని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  ఈ నెల  18న జరిగిన  తెలంగాణ  కేబినెట్ సమావేశం  జీవో  111 ను ఎత్తివేసింది .

click me!