తెలంగాణలో కత్తుల కౌగిలి

Published : Aug 16, 2017, 07:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
తెలంగాణలో కత్తుల కౌగిలి

సారాంశం

చరిత్రలో తొలిసారి వైరి పక్షాల కలయిక మహా కూటమి దిశగా అడుగులు అవగాహనకు వచ్చిన కాంగ్రెస్, టిడిపి  పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ టిఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిపోయిందన్న చర్చ

ఒకప్పుడు ఆ రెండు బాగా బతికిన పార్టీలే. ఆ రెండు పార్టీలు ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగానే ఉన్నయ్. బద్ధ శత్రు పార్టీలుగానే బతికినయ్. దశాబ్దాల తరబడి ఇదే వైరం నడిచింది. కానీ ఆ రెండు పార్టీలకు కాలం కలిసి వస్తలేదు. డేంజర్ జోన్ లకు పొయినయ్. ఇక లాభం లేదనుకున్న ఆ పార్టీలు కలిసి ఉంటే కలదు సుఖమనుకున్నయి. రానున్న రోజుల్లో కలిసే నడవాలని నిర్ణయించుకున్నాయ్.

ఆ రెండు పార్టీలేమిటో ఇప్పటికే అర్థమై ఉంటది కదా? అదేనండీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన కాంగ్రెస్, టిడిపిలే. తెలంగాణ ఏర్పాటుతో ఆ రెండు పార్టీలు తెలంగాణలో జావగారిపోయినయి. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు మరింత విలవిలలాడిపోతున్నయి. దిక్కు దివానం లేని దుస్థితికి నెట్టబడుతున్నయి కాంగ్రెస్, టిడిపి పార్టీలు.

దీంతో ఎలాగైనా బలం పుంజుకునేందుకు ఆ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. చరిత్రలో ఇప్పటివరకు వైరి పార్టీలుగానే ఉన్నాయి కాంగ్రెస్, టిడిపిలు. తొలిసారిగా తెలంగాణలో ఆ వైరి పార్టీలే చేతులు కలపనున్నాయి. రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి జట్టు కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వాటితోపాటు లెఫ్ట్ పార్టీలను, కోదండరాం నేతృత్వంలోని జెఎసిని కూడా కలుపుకుని మహా కూటమి ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతాడన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన కాంగ్రెస్ వైపు పోతాడా? లేక బిజెపి వైపు పోతాడా? లేక సొంతంగానే కొత్త పార్టీ పెట్టుకుంటాడా అన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా టిడిపిలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఏ కారణం చేతనైనా తెలంగాణలో టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే మాత్రం రేవంత్ పార్టీ మారే అవకావం కానీ, కొత్త పార్టీ ఏర్పాటు కానీ జరగొచ్చని ప్రచారంలో ఉంది.

ఇక ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత ఒకరు భేటీ అయ్యారని తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్ పార్టీ మార్పు అంశం కూడా చర్చకు వచ్చిందట. కాంగ్రెస్ లోకి రావొచ్చు కదా అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే అవకాశం లేదని రేవంత్ తేల్చి చెప్పిండట. అయినా తాను కాంగ్రెస్ లోకి వస్తే ఇప్పటి వరకు బలంగా ఉన్న టిడిపి ఓటు బ్యాంకు టిఆర్ఎస్ కు వెళ్లిపోయే ప్రమాదముందని చెప్పిండట రేవంత్. అందుకోసమే తాను టిడిపిలోనే ఉంటానని, కాకపోతే మహాకూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పినట్లు తెలిసింది.

2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా కేవలం 63 సీట్లలో మాత్రమే గెలిచిందన్నారట రేవంత్. అప్పటివరకు టిఆర్ఎస్ కు ఉద్యమ నేపథ్యం, కొత్త పార్టీ కావడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారట. ఇక రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉందని, ఆ ఎఫెక్టు మైనస్ గా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారట. ఈ నేపథ్యంలో టిడిపి ఓట్ బ్యాంకును డిస్టర్బ్ చేసుకోకుండా మహా కూటమితో ఎన్నికలకు పోతేనే టిఆర్ఎస్ ను గద్దె దించడం ఖాయమన్న వాదన రేవంత్ తీసుకొచ్చారట.

మొత్తానికి 2019 ఎన్నికలు తెలంగాణలో సరికొత్త ఆవిష్కరణలకు తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu