కుంతియా సే క్యా హోతా

Published : Aug 16, 2017, 04:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కుంతియా సే క్యా హోతా

సారాంశం

కుంతియాతో అయ్యేదేముంది? సోనియా, రాహుల్ ను కలుస్తా యువ నాయకత్వం పిసిసికి వస్తది లక్ష ఉద్యోగాల పై కెసిఆర్ మోసం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పైర్ అయ్యారు. కుంతియా మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. కుతింతియా వచ్చి చెప్పినంతమాత్రాన అయ్యేది లేదు, పొయ్యేది లేదు అని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి.

తొందరలోనే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ లను కలుస్తానని చెప్పారు. కార్యకర్తలు ఎవరు నిరాశ పడొద్దని కోమటిరెడ్డి సూచించారు. త్వరలోనే యువరక్తం ఉన్న నాయకుడు పిసిసి పగ్గాలు చేపట్టడం ఖాయమన్నారు. యువ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక గత మూడున్నర ఏండ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలు ఒక్క ఏడాది లో ఎలా భర్తీ చేస్తారని కెసిఆర్ ను ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఈ విషయం లో కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu