టెన్త్ పరీక్షల నిర్వహణపై 8న కేసీఆర్ సమీక్ష: ఎగ్జామ్స్ ఉంటాయా, పాస్ చేస్తారా?

By narsimha lode  |  First Published Jun 7, 2020, 4:52 PM IST

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించినా కూడ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.


హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించినా కూడ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు జూలై 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతించలేదు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Latest Videos

undefined

also read:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఈ రెండు జిల్లాల విద్యార్థులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు కాపీ శనివారం నాడు పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొంది.

టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై  ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.పరీక్షలు లేకుండా అందరిని కూడ పాస్ చేసేందుకు సర్కార్ ఆలోచనలో ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత లేదు. కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

8వ తేదీ సాయంత్ర లాక్ డౌన్ పై కూడ కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలపై మినహాయింపులు ఇవ్వనున్న నేపథ్యంలో ఆయా రంగాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారు.


 

click me!