హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్‌కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్‌కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ టీ దుకాణంలో మేయర్ టీ తాగారు. అయితే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో, ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
కొంతమంది నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
undefined
Also Read:కరోనాతో తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ మనోజ్ మృతి
అనివార్య పరిస్దితిలో సడలింపులు ఇవ్వడం జరిగిందని బొంతు వెల్లడించారు. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని.. అయితే కొంతమంది జాగ్రత్తలు పాటిస్తున్నారని, మరికొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అందువల్లే కేసులు పెరుగుతున్నాయని మేయర్ వ్యాఖ్యానించారు.
కాగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కోవిడ్ 19 కేసుల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో నగరంలో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3 నాటికి నగరంలో 159 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
Also Read:కరోనా కేసులతో గాంధీ ఆసుపత్రి ఫుల్, కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా నిమ్స్
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అభిప్రాయపడ్డారు.