తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి స్పీచ్

Published : Dec 07, 2023, 02:02 PM ISTUpdated : Dec 07, 2023, 03:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి స్పీచ్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేేవంత్  రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు. అలాగే మంత్రులు కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. 

జై సోనియమ్మ నినాదంతో స్పీచ్ ప్రారంభించారు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో, త్యాగల పునాదులతో ఏర్పడిందని అన్నారు. ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరనే ద్యేయంగా తెలంగాణ ఏర్పడిందని... కాంగ్రెస్ పార్టీ సమిదిగా మారి తెలంగాణను ఏర్పాటుచేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

అయితే త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్లు సరైన పాలన సాగలేదని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెబుదామంటే వినేవాళ్లు లేకుండాపోయారని అన్నారు. అందువల్లే ప్రజలు ఆ పార్టీని  ఓడించారని రేవంత్ పేర్కొన్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం వెనకున్నది కార్యకర్తలేనని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆలోచనను ఉక్కుసంకల్పంగా మార్చి, తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో తాను, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా వుంటుందని రేవంత్ అన్నారు. 

ఇప్పటినుండి తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని... ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు స్వేచ్చ స్వాతంత్రాలు వచ్చాయన్నారు.  

ప్రగతి చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను ప్రమాణస్వీకారం వేళ బద్దలుగొట్టించామని రేవంత్ తెలిపారు. తన తెలంగాణ కుటంబసభ్యులు ఎప్పుడు రావాలన్నా ప్రగతిభవన్ కు రావచ్చని... సమస్యలు చెప్సుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనను మిళితం చేస్తానని.. మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. . 

Read More  రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం వేళ బద్దలవుతున్న ప్రగతి భవన్ గేట్లు

తెలంగాణ ప్రాంత ప్రలజ ఆకాంక్షలు కాపాడతానని రేవంత్ తెలిపారు.  శాంతిభద్రతలు కాపాడుతూనే తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా చేస్తానన్నారు. నిస్సహాయులకు అండగా వుంటా... మీ సోదరుడిగా, బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తానని రేవంత్ అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణను ఇందిరమ్మ రాజ్యంగా మారుస్తా...  అభివృద్ది ఫథంలో నడుపుతామన్నారు. అధికారం చేపట్టిన మేము పాలకులం కాదు సేవకులం అని నిరూపిస్తాను.. మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ది కోసం వినియోగిస్తానని అన్నారు. 

మీ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటా... కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా... ఈరోజు నుండి నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాల కోసం పనిచేస్తా...వారికి న్యాయం చేస్తానని రేవంత్ అన్నారు. రేపు జ్యోతిరావు పూలే భవన్  అంటే ప్రగతి భవన్ లో ఉదయం 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహిస్తామని.... మీరందరు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. .

స్పీచ్ అనంతరం ఆరు గ్యారంటీల ఫైలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలు రజనికి ఉద్యోగ నియామక పత్రం అందజేసారు. వేద పండితులతో పాటు సర్వమతాలకు చెందినవారు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu