వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి విక్రమార్క రోజూ పూజలు..

Published : Dec 07, 2023, 12:50 PM IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి విక్రమార్క రోజూ పూజలు..

సారాంశం

మల్లు భట్టి విక్రమార్క ఇంట్లోని పూజగదిలో దేవతామూర్తుల ఫొటోలతో పాటు ఓ వైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెద్దది కనిపిస్తుంది. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూర్చుని ధ్యానం చేస్తున్న ఫోజులో కనిపిస్తుంది. 

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మల్లు భట్టి విక్రమార్కకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. మల్లు భట్టి విక్రమార్క మొదటినుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన విశ్వాసానికి మరో పేరు అని రుజువు చేసే ఓ ఆసక్తికర విషయం ఆయన ఇంట్లోని పూజగదిలో కనిపించింది.

మల్లు భట్టి విక్రమార్క ఇంట్లోని పూజగదిలో దేవతామూర్తుల ఫొటోలతో పాటు ఓ వైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెద్దది కనిపిస్తుంది. ఈ పొటోకు కూడా దేవుడి ఫోటోలతో పాటు దండ వేసి ఉంది. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూర్చుని ధ్యానం చేస్తున్న ఫోజులో కనిపిస్తుంది. దీన్నిబట్టి భట్టీకి వైఎస్సార్ అంటే ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో, ఎంత ప్రేమో.. ఎంత గురుతర భావమో అర్థం అవుతుంది. 

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీ కారానికి కేసీఆర్ వెడతారా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలామందికి విశ్వాసనీయమైన నేత. ఎంతోమందిని ఆదుకున్న నాయకుడు. వారు జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన సహాయం చేసిన ఆపన్నహస్తుడు. మరెంతో మందికి ప్రేమైక మూర్తి. అది ఇప్పుడు తాజాగా తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ వేళ వెలుగు చూడడం విశేషం. 

కాసేపట్లో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వెడుతూ కూడా ఆ దివంగత నేతకు వినమ్రంగా నివాళులు అర్పించి, పూజలు చేసి వెళ్లడం ఆయనకు వైఎస్సార్ మీద ఎంత ప్రేమ ఉందో చెబుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Heavy Rain In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం| Asianet News Telugu