CM Revanth Reddy: నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

By Mahesh KFirst Published Dec 15, 2023, 8:17 PM IST
Highlights

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని, సాధారణ ట్రాఫిక్‌లోనూ  తానూ వెళ్లుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశించారు. తన కోసం ప్రత్యేకంగా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయవద్దని వివరించారు. తాను సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లిపోతానని చెప్పారు. సాధారణ ప్రయాణికుల్లాగే.. తన కాన్వాయ్ కూడా రోడ్డెక్కుతుందని తెలిపారు. రేపటి నుంచి ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించనుంది.

సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్‌లో ఉంటున్నారు. అక్కడి నుంచి సెక్రెటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఇతర కార్యక్రమాలకు బిజీబిజీగా ప్రతి రోజూ వెళ్లాల్సి ఉంటుంది. అదీగాక, ప్రజా వాణి కోసం ప్రజలు రాజధాని నగరానికి పోటెత్తుతున్నారు. ఈ రోజు సుమారు 7 వేలకు పైగా మంది ప్రజా వాణి కోసం హైదరాబాద్ రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Latest Videos

Also Read: Year Ender 2023: ఈ ఏడాది ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏం సెర్చ్ చేశాయి?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా సాధారణ ప్రయాణికుడిగానే వెళ్లారు. ఆ రోజు కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కారు కూడా. ఆ తర్వాత పోలీసు అధికారులు ఆయన వెళ్లే మార్గాల్లో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయన బయల్దేరానికి మూడు నాలుగు నిమిషాల ముందు నుంచే ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నాయరని సీఎం రేవంత్ రెడ్డి గ్రహించినట్టు తెలుస్తున్నది. తాను స్వయంగా సాధారణ ప్రయాణికుడిలాగే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పై సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతోపాటు మరో కీలక నిర్ణయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు.

Also Read: YCP: ఎన్నికల ముంగిట్లో వైసీపీకి దెబ్బ.. టీడీపీలోకి జగన్ ఎమ్మెల్యేలు

ధర్నాచౌక్‌లో నిరసనలకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా స్వామ్యంలో ప్రతి పౌరుడు నిరసనను తెలియజేప్పే హక్కును కలిగి ఉంటాడు. సీఎం ఆదేశాల మేరకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ధర్నా చౌక్ పరిశీలించారు. ధర్నాచౌక్‌లో ధర్నా నడుస్తున్నప్పుడూ ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తదని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చని చెప్పారు. అయితే, శాంతి భద్రతలకు భంగం కలుగకుండా చూసుకుంటే చాలని, ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరుస్తామని వివరించారు.

click me!