పోతిరెడ్డిపాడు ఆపాలి.. లేదంటే మేం కూడా: ఏపీకి కేసీఆర్ అల్టీమేటం

By Siva KodatiFirst Published Oct 6, 2020, 7:48 PM IST
Highlights

నదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణం ఏపీ ప్రభుత్వం ఆపాలని కేసీఆర్ కోరారు. 

నదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణం ఏపీ ప్రభుత్వం ఆపాలని కేసీఆర్ కోరారు.

ఆపకపోతే ఆలంపూర్-పెద్దమరూర్ దగ్గర బ్యారేజ్ నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుంటామని సీఎం పేర్కొన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం చేశారన్న కేసీఆర్... కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లను ఆపాలని పలుసార్లు కోరామని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం సరికాదని సీఎం విమర్శించారు.

తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమన్నారు. నదీ జలాల పంపిణీలో తమకు జరిగిన అన్యాయ ఫలితమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్ గుర్తుచేశారు. నదీ జలాల కేటాయింపు కోసం ట్రిబ్యునల్‌ వేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు.  

click me!