టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ: దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్

By Nagaraju TFirst Published Oct 21, 2018, 3:38 PM IST
Highlights

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుతోపాటు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు. అలాగే కేసీఆర్ ప్రకటించిన తొలిజాబితాలోని 105 మంది అభ్యర్థులు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. 
 

హైదరాబాద్: ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుతోపాటు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు. అలాగే కేసీఆర్ ప్రకటించిన తొలిజాబితాలోని 105 మంది అభ్యర్థులు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి కేవలం 42 రోజులు మాత్రమే ఉండటంతో మలివిడత ప్రచారాన్ని ఏ విధంగా చెయ్యాలి...గెలుపు వ్యూహాలు రచించనున్నారు. 

వీటితోపాటు టీఆర్‌ఎస్ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి అన్న అంశంపై కూడా సదస్సులో వివరించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల స్పందనపై ఆరా తీస్తున్నారు.
 
అలాగే పూర్తి స్థాయి మేనిఫెస్టో త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. నాలుగున్నరేండ్లుగా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజలకు వివరించడంపై అవగాహన కల్పిస్తున్నారు.  

click me!