
CM KCR Yadadri Tour :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం( ఫిబ్రవరి 7న) యాదాద్రిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీంటినీ సీఎం పరిశీలించనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రధాన ఆలయం, క్యూలైన్లు, శివాలయం, పుష్కరిణిని పరిశీలించనున్నారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ తరుణంలో దేశ విదేశాల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పున: ప్రారంభ సమయంలో చేయాల్సిన ఏర్పాటుపై ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆలయ పున: ప్రారంభ సమయంలో నిర్వహించే యాజ్ఞ, యాగాదాల గురించి.. చర్చించనున్నారు. ఈ తరుణంలో దాదాపు 8 రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాగంలో 10వేల మంది రుత్వికులతో పాల్గొనున్నారు. ఇతర ఏర్పాట్ల ఆరా తీయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
రేపు సీఎం కేసీఆర్ యాదాద్రి లో పర్యటించి పోతున్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ముగింపు దశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆలయ పునః ప్రారంభంలో చేయవల్సిన ఇతర ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించనున్నారు.