బీజేపీ vs టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ : కేటీఆర్‌కు కౌంటరిచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

Siva Kodati |  
Published : Feb 06, 2022, 03:36 PM ISTUpdated : Feb 06, 2022, 05:23 PM IST
బీజేపీ vs టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ : కేటీఆర్‌కు కౌంటరిచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

సారాంశం

ముచ్చింతల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు అవ్వడంపై బీజేపీ విమర్శిస్తూ వుంటుంటే .. తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలు గరంగరంగా ట్వీట్స్ పెడుతున్నారు.   

ముచ్చింతల్‌లోని (muchintal) సమతామూర్తి విగ్రహావిష్కరణ (samatha murthy) సాక్షిగా టీఆర్ఎస్ (trs) - బీజేపీ (bjp) మధ్య పొలిటికల్ వార్ తీవ్రమవుతోంది. ప్రధాని కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) గైర్హాజరు అవ్వడంపై బీజేపీ విమర్శిస్తూ వుంటుంటే .. తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలు గరంగరంగా ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. సమతామూర్తి విగ్రహాన్ని వివక్షకు మారుపేరైన వ్యక్తి ఆవిష్కరించారని ఇది సమతామూర్తి స్పూర్తికే విరుద్దమని ట్వీట్ చేశారు కేటీఆర్. 

అటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగుందా లేదో తనకు తెలియదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka). అయితే ప్రధాని పర్యటన అంతా బీజేపీ కార్యక్రమంలా సాగిందని అన్నారు. మోడీ సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని భట్టి ఎద్దేవా చేశారు. రామానుజాచార్యుల విధానానికి మోడీ విధానం పూర్తి వ్యతిరేకమని దుయ్యబట్టారు. సమానత్వం గురించి మాట్లాడే మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని హితవు పలికారు. 

మరోవైపు కేటీఆర్ (ktr) ట్వీట్‌కు కౌంటరిచ్చారు బీజేపీ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) . మోడీని చూసి టీఆర్ఎస్ నేతలు అసూయపడుతున్నారని.. బర్నాల్ రాసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన సెటైర్లు వేశారు. నిన్న ముచ్చింతల్‌లో ఒక పక్క విగ్రహావిష్కరణ జరుగుతుండగా.. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో ట్విట్టర్‌లో టీఆర్ఎస్ నేతలు మోడీని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన నెటిజన్లతో పాటు టీఆర్ఎస్ నేతలు కూడా ట్విట్టర్ వేదికగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంపై మోడీ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ఎండగట్టారు. ముఖ్యంగా కేంద్ర నిధుల పంపిణీ.. తెలంగాణకు అందుతున్న సాయం.. అలాగే విభజన హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్ట్ హోదా వంటి అనేక అంశాలపై తమదైన శైలిలో ప్రశ్నించారు నెటిజన్లు. 

కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం... పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఎందుకు ఇవ్వలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపై తమ ప్రభుత్వంతో పాటు మంత్రులు కేంద్రానికి పంపిన లేఖలపై ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై చూపిస్తున్న వివక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక రాష్ట్రంలో ఘనంగా జరిగే మేడారం జాతరను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఉన్నత విద్యాసంస్థలు తెలంగాణకు ఏవని ప్రశ్నించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఏడేళ్లుగా వందల సార్లు విజ్ఞప్తులు చేస్తున్నా తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 84 నవోదయా విద్యాసంస్థలను కేంద్రం ఇస్తే .. అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు