తెలంగాణ సీఎం కేసీఆర్ ఇావాళ ఉదయం ఏటూరు నాగారంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా ఏరియల్ సర్వేను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. ఏటూరు నాగారంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో కేసీఆర్ మాట్లాడనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR ఆదివారం నాడు ఉదయం Etur Nagaram వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా సీఎం కేసీఆర్ ఇవాళ వరద ముంపు ప్రాంతాల్లో Aerial Survey నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం సరిగా లేనందున సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నారు. శనివారం నాడు రాత్రే సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వరంగల్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఏటూరు నాగారం చేరుకొని వరదను పరిశీలించనున్నారు. వరద ముంపు గ్రామాల్లో బాధితులను సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. వరద ముంపు బాధిత ప్రజలకు సహాయం గురించి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపు ఏటూరు నాగారం నుండి సీఎం కేసీఆర్ భద్రాచలం వెళ్లనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కటాక్షపూర్ వద్ద సీఎం కేసీఆర్ వరదను పరిశీలించారు.
Bhadrachalam లో గోదావరి వరద ఉధృతితో పాటు వరద ముంపు బాధిత ప్రజలతో కేసీఆర్ మాట్లాడనున్నారు.
Telangana రాష్ట్రంలో దాదాపుగా వారం రోజులకుపైగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా Godavari పరివాహక ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భద్రాచలం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని సుమారు 4600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 1986 లో వచ్చిన తరహాలోనే గోదావరికి వరద వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు.
భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. భద్రాచలం పట్టణంలోసహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఐఎఎస్ అధికారి Sridhar ను ప్రభుత్వం నియమించింది. మరో వైపు 101 మంది ఆర్మీ సభ్యుల బృందం కూడా భద్రాచలం చేరుకుంది. NDRF , SDRF బృందాలు కూడా భద్రాచలం జిల్లాలో ఇప్పటికే సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. భద్రాచలానికి హెలికాప్టర్ తో పాటు అవసరమైన ఇతర సామాగ్రిని కూడా అధికారులు తెప్పించారు.
గోదావరికి వరద పోటెత్తడంతో భధ్రాచలం వద్ద ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం నుండిఏపీ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణం మొత్తం గోదావరి నీరు చేరింది.
ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో వరద ప్రభావిత ప్రాంత జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also read:తెలంగాణ మరో రెండ్రోజులు భారీ వర్షాలు... నేడు,రేపు ఆ జిల్లాల్లో హైఅలర్ట్
ఈ రెండు రోజుల పాటు కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భద్రాచలం బయలు దేరిన కేసీఆర్
ఏటూరు నాగారం మీదుగా తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలానికి వెళ్తున్నారు. వర్షంలోనే సీఎం కాన్వాయ్ గోదావరి పరివాహక ప్రాంతాల గుండా భద్రాచలానికి బయలు దేరింది. తొలుత ఏటూరు నాగారంలో సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తారని భావించారు. అయితే భద్రాచలానికి వెళ్లాలని పర్యటనలో మార్పు చోటు చేసుకొంది. దీంతో కేసీఆర్ వదర ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ భద్రాచలానికి బయలు దేరారు. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు మరో వైపు గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను కూడా పరిశీలించే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సౌకర్యాలపై కూడా కేసీఆర్ ఆరా తీయనున్నారు. బాధితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు.