పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయండి : టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

Siva Kodati |  
Published : Jul 16, 2022, 05:33 PM ISTUpdated : Jul 16, 2022, 05:48 PM IST
పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయండి : టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

సారాంశం

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. ఎన్డీయే సర్కార్ ను పార్లమెంట్ లో నిలదీయాలని ఆయన ఎంపీలను ఆదేశించారు.   

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (parliament monsoon session 2022) ప్రారంభంకానున్న నేపథ్యంలో వివిధ అంశాలపై ఎన్డీయే సర్కారును నిలదీయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ (kcr) దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం వైఖరిని పార్లమెంట్ లో లేవనెత్తాలని సూచించారు . ఎన్డీయే హయాంలో దేశ ఆర్ధిక పరిస్ధితి ఎలా వుంది అనే అంశంపై జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలతో పాటు పార్లమెంట్ లో ప్రస్తావించాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్డీయే (nda) వ్యతిరేక పార్టీలతో కలిసి పార్లమెంట్‌లో లేవనెత్తే అంశాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. విభజన హామీలను కూడా ప్రస్తావించాలని టీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. 

కేంద్రంపై పోరాటానికి పార్లమెంటే సరైన వేదిక అన్న కేసీఆర్.. ఎనిమిదేళ్లలో పైసా డీఫాల్ట్ రాకుండా తిరిగి చెల్లించిన రికార్డ్ తెలంగాణదేనన్నారు. ఆర్బీఐ వేసే బిడ్‌లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ వుందని.. నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి విషయంలో కేంద్రం మాట మార్చిందని సీఎం ఎద్దేవా చేశారు. రూ.53 వేల కోట్లు అని ప్రకటించి.. రూ.23 వేల కోట్లకు కుదించింది కేంద్రమేనని కేసీఆర్ ఆరోపించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లింది ఎంత.. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది ఎంత అని కేసీఆర్ ప్రశ్నించారు. 

ఇకపోతే... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లో మోడీ ప్రభుత్వం లోక్‌సభలో దాదాపు 20కిపైగా నూత‌న‌ బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు, ఇంధన సంరక్షణ సవరణ బిల్లు, కుటుంబ న్యాయస్థాన సవరణ బిల్లులు ప్ర‌ధానంగా ఉన్నాయి. 

Also REad:Parliament Monsoon Session: కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ... పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాంపై చర్చ

లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఈ సమావేశంలో  పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు పరిశీలించిన నాలుగు బిల్లులతో పాటు 24 కొత్త బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లులలో ప్ర‌ధానంగా కంటోన్మెంట్ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలతో సమలేఖనం చేయడంలో గొప్ప అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని, కంటోన్మెంట్‌లలో జీవితం సౌలభ్యాన్ని సులభతరం చేయాలని ప్రతిపాదించింది. అలాగే... భారత అంటార్కిటిక్ బిల్లు 2022 ను సెషన్‌లో తిరిగి ప్రవేశపెట్టబడుతుందని పేర్కొంది. ఇంతకుముందు ఈ బిల్లును ఏప్రిల్ 1, 2022 న ప్రవేశపెట్టారు.

బులెటిన్ ప్రకారం.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ సవరణ బిల్లు, సహకార సంఘాల సవరణ బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు 2022 ఈ సెషన్‌లో ప్రవేశపెట్ట‌నున్నారు. అలాగే.. ఈ సెషన్‌లో సెంట్రల్ యూనివర్శిటీల సవరణ బిల్లు 2022 కూడా ప్రవేశపెట్టబడుతుంది, దీని ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్‌ను గతిశక్తి విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రతిపాదించబడింది.

కాఫీ (ప్రమోషన్, డెవలప్‌మెంట్) బిల్లు, ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్‌ల అభివృద్ధి బిల్లు, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం, వస్తువుల భౌగోళిక సూచికలను సవరించాలని ప్రతిపాదిస్తుంది. అలాగే..  రిజిస్ట్రేషన్, రక్షణ (సవరణ) బిల్లు, గిడ్డంగుల  అభివృద్ధి& నియంత్రణ బిల్లుల‌ను కూడా సవరించాలని ప్రతిపాదిస్తుంది. అలాగే.. నిషేధిత ప్రాంతాలను హేతుబద్ధీకరించి, ఇతర సవరణలను తీసుకురావాలని, పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల (సవరణ) బిల్లును కూడా ప్రభుత్వం జాబితా చేసింది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?