కారణమిదీ: ఎల్లుండి తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ టూర్

By narsimha lodeFirst Published Aug 29, 2022, 8:55 PM IST
Highlights

ఎల్లుండి తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  హైద్రాబాద్ నుండి ఉదయమే సీఎం కేసీఆర్ పాట్నాకు వెళ్తారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన బీహార్ కు చెందిన జవాన్లకు పరిహారం చెల్లించనున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  ఈ నెల 31న బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం నాడు ఉదయం హైద్రాబాద్ నుండి సీఎం పాట్నాకు వెళ్తారు. గతంలో ప్రకటించిన విధంగానే  గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ రాష్ట్రానికిచెందిన ఐదుగురు భారత సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన  బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్ధిక సహాయం అందిస్తారని అధికారులు తెలిపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి కేసీఆర్ చెక్కులు అందిస్తారు. 

బీహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో మధ్యాహ్నం కేసీఆర్  భోజనం చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. నితీష్ కుమార్ ఇటీవలనే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీతో దోస్తీని  వదిలేసి ఆర్జేడీతో జతకట్టారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీష్ కుమార్ తో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. నితీష్ కుమార్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారుఈ తరుణంలో నితీష్ కుమార్ తో  కేసీఆర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.
 

click me!