ఢిల్లీలో సీఎం కేసీఆర్‌: నేడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ..!

Published : May 21, 2022, 11:09 AM IST
ఢిల్లీలో సీఎం కేసీఆర్‌: నేడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ..!

సారాంశం

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నేడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశం కానున్నారు. 

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్‌, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌  ఉన్నారు. తన పర్యటనలో భాగంగా.. ఆర్థిక వేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే కేసీఆర్ నేడు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశం కానున్నారు. ఢిల్లీలోనే ఇరువురు నేత మధ్య భేటీ జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ పార్టీల ఐక్యవేదికపై ఈ సమావేశంలో చర్చించనట్టుగా సమాచారం. 

ఇక, సీఎం కేసీఆర్.. మే 22న చండీఘర్‌లో పర్యటించనున్నారని.. వివాదస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. తర్వాతి రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లలో గులాబీ బాస్ పర్యటించనున్నారు. 

ఈ నెల 26న ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారు.  దేశ రాజకీయాలపై దేవేగౌడతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ నెల 27న రాలేగావ్ సిద్ది ప్రాంతానికి కేసీఆర్ వెళ్తారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారావేతో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. అక్కడి నుండి షీర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళ్తారు. షీర్డీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.  ఈ నెల 29 లేదా 30 తేదీల్లో కేసీఆర్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది.  గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?