హైదరాబాద్ లో కలకలం సృష్టించిన బేగం బజార్ పరువు హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ : హైదరాబాద్ బేగంబజార్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న నీరజ్ పన్వార్ అనే యువకుడిని ఐదుగురు వ్యక్తులు శుక్రవారంనాడు అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు నిందితులను హైదరాబాదు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు కర్ణాటక రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, హైదరాబాద్ నడిబొడ్డున మరో begum bazar honor killing జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇటీవల సరూర్నగర్లో నాగరాజును అమ్మాయి కుటుంబ సభ్యులు కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ చేపల మార్కెట్ సమీపంలో ఒక యువ వ్యాపారి శుక్రవారం రాత్రి Hyderabad honor killingకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆయనను అంతమొందించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ సతీష్ కుమార్, సీఐ అజయ్ కుమార్ లు తెలిపిన వివరాల ప్రకారం…బేగంబజార్ కోల్సావాడికి చెందిన neeraj kumar panwar (22) పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట love marriage చేసుకున్నాడు.
undefined
వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు నీరజ్ మీద ఇంకా కక్షపెంచుకున్నట్లు తెలుస్తోంది. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. వారం రోజుల నుంచి నీరజ్ షాప్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఏ టైంలో ఏం చేస్తున్నాడు.. అనే విషయాన్ని సంజన సోదరుడు గమనించాడు. శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉండటంతో పాటు.. జనసంచారం తక్కువగా ఉండటంతో.. ఇదే అదనుగా భావించి స్నేహితులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు.
ఆ తర్వాత కొబ్బరిబోండాల కత్తితో పొడిచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వచ్చేసరికి నీరజ్ పన్వార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని షాహీనాయత్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నీరజ్ ను చంపింది ఐదుగురు అని నిర్ధారించుకున్న పోలీసులు… సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి.. పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే కులాంతర వివాహం చేసుకున్న తన భార్య కుటుంబీకుల నుంచి ప్రమాదం తప్పదని ముందే గ్రహించి ఏడాది కిందట అఫ్జల్గంజ్ పోలీసులను ఆశ్రయించాడు నీరజ్. తనకు రక్షణ కల్పించాలంటూ అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నీరజ్ మృతితో ఆగ్రహం చెందిన బేగంబజార్ వ్యాపారులు శుక్రవారం అర్ధరాత్రి భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. శనివారం బేగంబజార్ బంద్ కు పిలుపునిచ్చారు.