ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్.. రేపు మోడీతో భేటీ

By Siva KodatiFirst Published Oct 3, 2019, 4:08 PM IST
Highlights

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రాజధానికి బయలుదేరారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రాజధానికి బయలుదేరారు.

పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీని కలుస్తారు. ఈ భేటీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానంగా చర్చించనున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి మోడీతో భేటీ కానున్నారు. రెండో దఫా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడ వీరిద్దరూ ఇంతవరకు ముఖాముఖి కలవలేదు. గతంలో రెండు మూడు దఫాలు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు.

ఈ సమయంలో  సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కలవలేదు. అయితే ఈ నెల 4వ తేదీన మోడీ అపాయింట్‌మెంట్  కేసీఆర్ కు దక్కింది.దీంతో కేసీఆర్  ఈ నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరనున్నారు. ఈ నెల 1వ తేదీన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో  సుధీర్ఘంగా  విభజన సమస్యలపై చర్చించారిన సమాచారం.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకుగాను  ఏపీ, తెలంగాణ సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో పాటు  ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని  ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ వితనతి పత్రం సమర్పించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని కోరనున్నారు.

click me!