పోలీస్ అకాడమీ వేస్ట్: డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Oct 3, 2019, 1:06 PM IST
Highlights

సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ మరో వార్తల్లో నిలిచారు. వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో దుమారం రేపుతున్నాయి.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్: పోలీస్ అకాడమీపై అకాడమీ డైరెక్టర్ వీకేసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో సంచలనానికి కారణమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధానే అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నేషనల్ పోలీస్ అకాడమీకి కూడ ఇదే పరిస్థితి నెలకొందని  వీకే సింగ్ కుండబద్దలు కొట్టారు. పోలీసుల ప్రదర్శన సరిగా లేదని  కూడ ఆయన విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న ఖైదీల్లో  90 శాతం పేదవాళ్లేనని  వీకే సింగ్  చెప్పారు.  వీకే సింగ్ గతంలో  కూడ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియాపై కూడ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఓ మీడియా ఛానెల్ పై ఆయన కేసు కూడ పెట్టారు. అంతేకాదు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడ మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 

click me!