మరోసారి రాజశ్యామల యాగం:ఈ నెల 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో కేసీఆర్ యాగం

By narsimha lode  |  First Published Dec 11, 2022, 5:15 PM IST

 ఈ నెల  13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం కోసం రేపే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ నెల 14న ఢిల్లీలో నూతన  పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు


హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఈ నెల  13, 14 తేదీల్లో కేసీఆర్   రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎష్ గా  మారుస్తూ ఈసీ పంపిన  లేఖపై ఈ నెల  9వ తేదీన కేసీఆర్ సంతకం చేశారు.ఈ లేఖను ఈసీకి పంపారు.   ఈ నెల  14వ తేదీన  ఢిల్లీలో  బీఆర్ఎస్  తాత్కాలిక భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. దీంతో  బీఆర్ఎస్ విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 12, 14 తేదీల్లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు.2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో  రాజ శ్యామల యాగాన్ని నిర్వహించారు.  ఈ యాగం ముగించుకొని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.  2018 ఎన్నికల్లో  కేసీఆర్ విజయం సాధించారు. రెండో దఫా రాష్ట్రంలో  కేసీఆర్ అధికారాన్ని సాధించారు.  

also read:ఈ నెల 14న న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం:ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

Latest Videos

undefined

దేశ వ్యాప్తంగా  పార్టీని విస్తరించాలని కేసీఆర్   భావిస్తున్నారు. ఇందుకు టీఆర్ఎస్ పేరును మార్చాలని భావించారు. ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  తీర్మానం చేశారు.ఈ తీర్మానం కాపీని ఈసీకి  పంపారు.ఈ విషయమై  ఈసీ నుండి  ఇటీవలనే  కేసీఆర్ కు సమాచారం  వచ్చింది. ఈసీ పంపిన  లేఖపై  ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 01:20 గంటలకు సంతకం చేశారు. ఈ లేఖను  ఈసీకి పంపారు.  పార్టీ పేరును మార్చినందున పార్టీకి ఎలాంటి  ఇబ్బందులు లేకుండా  ఉండేందుకు వీలుగా  రాజశ్యామల యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో  తెలంగాణ సీఎం కేసీఆర్  ఈ నెల 12న ఢిల్లీకి వెళ్లనున్నారు.

వచ్చే ఎన్నికల్లో  కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి రాకుండా  తమ వంతు ప్రయత్నాలు చేస్తామని  కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే  కేసీఆర్  పార్టీ పేరు మార్చారు.  తెలంగాణలోని  పలు రాష్ట్రాల్లో కేసీఆర్  పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో  కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి రాకుండా  తమ వంతు ప్రయత్నాలు చేస్తామని  కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే  కేసీఆర్  పార్టీ పేరు మార్చారు.  తెలంగాణలోని  పలు రాష్ట్రాల్లో కేసీఆర్  పర్యటించనున్నారు. మహారాష్ట్ర నుండి  కేసీఆర్ తన పర్యటనను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్  కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.  ఏపీలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు గాను  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

click me!