ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణ వెనుక కుట్ర: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

By narsimha lode  |  First Published Dec 11, 2022, 4:45 PM IST


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవితను సీబీఐ అధికారులు విచారించడం వెనుక కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  చెప్పారు.


హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించడం వెనుక కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనం నేని సాంబశివరావు  చెప్పారు. ఆదివారంనాడు ఆయన హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ లిక్కర్ స్కాం ను నిష్పక్షపాతంగా  విచారణ చేయాలని  కూనంనేని సాంబశివరావు డిమాండ్  చేశారు. 

 ఎమ్మెల్యేల కొనుగోలులో విచారణ తర్వాత సీబీఐ, ఈడీ విచారణలను తెలంగాణలో  మరింత వేగవంతం చేశారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్  వ్యాఖ్యలు నిస్సిగ్గుగా  ఉన్నాయన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో  కవిత పేరు ఉందని తొలుత బీజేపీ నేతలు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: లంచ్ తర్వాత కవిత నుండి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల నుండి సమాచారం సేకరించేందుకు  గాను  సీబీఐ అధికారులు ఇవాళ  వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి  సీబీఐ అధికారులు వచ్చారు.  కవిత  నుండి సమాచారాన్ని సీబీఐ అధికారులు  సేకరిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు  లంచ్ బ్రేక్ ఇచ్చారు.  లంచ్  బ్రేక్  తర్వాత  కవిత  నుండి  సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సమాచార సేకరణ కోసం ఈ నెల 11,12,14,15 తేదీల్లో తాను సీబీఐ అధికారుల సమాచార కోసం  అందుబాటులో ఉంటానని  కవిత  సీబీఐకి సమాచారం పంపింది.ఈ సమాచారం ఆధారంగా  సీబీఐ అధికారులు ఇవాళ  సమాచారం సేకరిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అమిత్ ఆరోరాను  గత మాసంలో  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు. అమిత్  ఆరోరా   రిమాండ్  రిపోర్టులో  కవిత  పేరు వచ్చింది. ఈ రిమాండ్  రిపోర్టు బయటకు వచ్చిన మరునాడే  కవితకు సీబీఐ అధికారులు 160 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.

click me!