తెలంగాణ సీఎం కేసీఆర్ కి జ్వరం: ఢిల్లీలోనే చికిత్స

By narsimha lode  |  First Published Oct 17, 2022, 9:45 PM IST

 తెలంగాణ సీఎం కేసీఆర్ కి జ్వరం  వచ్చింది.అస్వస్థతకు గురైన కేసీఆర్  ఢిల్లీలోనే చికిత్స  తీసుకుంటున్నారు.
 


హైదరాబాద్:తెలంగాణ  సీఎం కేసీఆర్ కు   స్వల్ప  అస్వస్థతకు  గురయ్యారు. కేసీఆర్ కు జ్వరం వచ్చింది. ఢిల్లీలోని నివాసంలోనే కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం.గత వారం  రోజుల  క్రితం కేసీఆర్  ఢిల్లీకి వెళ్లారు.

.మరో నాలుగు రోజుల పాటు  కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు .పాలపన పరమైన  ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కేసీఆర ఢిల్లీకి  సీఎస్ సహా కీలక అధికారులను ఢిల్లీకి రావాలని కేసీఆర్  ఆదేశించారు.   జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్  పాలనపరమైన అంశాలపై చర్చించేందుకు గాను ఉన్నతాధికారులను ఢిల్లీకి  పిలిపించారు.   తెలంగాణ  సీఎస్ సోమేష్ కుమార్ సహా కొందరు సీనియర్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. బీఆర్ఎస్ ను పలు రాష్ట్రాల్లో  విస్తరించే  విషయమై  కేసీఆర్  పలువురితో చర్చిస్తున్నారు. టీఆర్ఎస్  పేరును  బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ  నెల 5న  టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
 
జాతీయ రాజకీయాల్లో  చక్రం తిప్పాలని  కేసీఆర్  భావిస్తున్నారు.ఈ  నేపథ్యంలో కేసీఆర్  పలు రాష్ట్రాల్లో పర్యటించాలని ప్లాన్  చేసుకుంటున్నారు. మహారాష్ట్ర నుండి  కేసీఆర్ పర్యటించనున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన  కేసీఆర్  ఢిల్లీలో  భారీ  బహిరంగ సభ  నిర్వహించనున్నారు.  మరో వైపు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  వచ్చే ఏడాది జనవరి మాసంలో కేసీఆర్   భారీ బహిరంగ  సభ నిర్వహించే అవకాశం  ఉంది.

Latest Videos

alsoread:సీఎస్‌ను ఢిల్లీకి రావాలని కేసీఆర్ ఆదేశం:మరో మూడు రోజులు హస్తినలోనే సీఎం

బీఆర్ఎస్ ను  బలోపేతం చేసే విషయమై  కేసీఆర్  సమాలోచనలు  చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.కేంద్రంలో 2024లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు.ఈ దిశగా డిల్లీ  వేదికగా కేసీఆర్  చర్చలు జరుపుతున్నారు.  ఈ చర్చలు  ఇంకా కొనసాగుతున్నాయి.నాలుగైదు  రోజుల తర్వాత  కేసీఆర్ ఢిల్లీ  నుండి హైద్రాబాద్  కు తిరిగి రానున్నారు.

click me!