ఓబులాపురం మైనింగ్ కేసు:డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

By narsimha lode  |  First Published Oct 17, 2022, 7:00 PM IST

ఓబులాపురం  మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లను  సీబీఐ కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. అభియోగాల నమోదుపై విచారణను ఈ  నెల 21కి  వాయిదా  వేసింది. 


హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్  పిటిషన్లను సోమవారంనాడుసీబీఐ కోర్టు కోట్టి వేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి  శ్రీలక్ష్మి,గాలి జనార్ధన్ రెడ్డి పీఏ అలీఖాన్ ,రిటైర్డ్ అధికారులు కృపానందం,  రాజగోపాల్ డిశ్చార్జ్  పిటిషన్లను  సీబీఐ కోర్టు కొట్టివేసింది.  ఓబులాపుంర  కేసులో అభియోగాల  నమోదుపై విచారణను ఈ నెల 21కి  వాయిదా వేసింది  కోర్టు.ఓఎంసీ కేసు విచారణను  వేగంగా  దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు  ఇటీవలనే ఆదేశించింది. గాలి జనార్ధన్  రెడ్డి గతంలోనే తాను దాఖలు చేసిన డిశ్చార్జ్   పిటిషన్ ను వెనక్కి తీసుకున్నాడు.

ఓబులాపురం  మైనింగ్  కేసులో  నిందితుల డిశ్చార్జ్  పిటిషన్లకు సంబంధించి ఇరువర్గాల వాదనలను విన్న సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనున్నట్టుగా   గతంలోనే ప్రకటించింది.ఈ  మేరకు  ఇవాళ డిశ్చార్జ్   పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది.

Latest Videos

ఓఎంసీ కేసులో  సీబీఐ వాదనలను  నిందితుల  తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా  చట్టప్రకారంగానే  వ్యవహరించారని   కోర్టులో తమ  వాదలను విన్పించారు. ఈ  వాదలను సీబీఐ  తరపు న్యాయవాదులు  తోసిపుచ్చారు. గాలి  జనార్ధన్  రెడ్డి  కంపెనీకి నిందితులంతా  సహకరించారని సీబీఐ తరపు న్యాయవాది  వాదించారు. ఈ మేరకు ఇరువర్గాల  వాదనలు విన్న కోర్టు డిశ్చార్జ్  పిటిషన్లపై ఇవాళ నిర్ణయం తీసుకొంది.
 

click me!