రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ్ భవన్ లో ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విందు ఇచ్చారు. ఈ విందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. కానీ పలువురు మంత్రులు ఈ విందుకు హాజరయ్యారు.
హైదరాబాద్:రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం నాడు రాత్రి రాజ్ భవన్ లో విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు. హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిపై పౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ , పలువురు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత సీఎం కేసీఆర్ అక్కడి నుండి ఫామ్ హౌస్ కు వెళ్లారు.
ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన విందులో పలువురు మంత్రులు , శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శీతాకాల విడిది కోసం వచ్చిన ద్రౌపది ముర్ము గౌరవార్ధం రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. కానీ పలువురు మంత్రులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా కాలం తర్వాత కేసీఆర్, గవర్నర్ తమిళిసై లు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
చాలా కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసైకి మధ్య గ్యాప్ కొనసాగుతున్న విషయం తెలిసిందే . రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ పై గవర్నర్ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై పలువురు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పారు.రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుల విషయమై గవర్నర్ చర్చించేందుకు రావాలని మంత్రులను కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ విషయమై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తో సమావేశమైన విషయం తెలిసిందే.