అదో డ్రామా కాన్ఫరెన్స్, మేం ట్యాక్స్‌లు తగ్గించడమేంటీ.. ఎనిమిదేళ్లలో ఏం చేశారు : మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 27, 2022, 08:44 PM IST
అదో డ్రామా కాన్ఫరెన్స్, మేం ట్యాక్స్‌లు తగ్గించడమేంటీ.. ఎనిమిదేళ్లలో ఏం చేశారు : మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం  కేసీఆర్. కరోనాపై మీటింగ్ పెట్టి.. రాష్ట్రాలను ట్యాక్స్ తగ్గించుకోమని చెప్పారని ఫైరయ్యారు. ఎనిమిదేళ్లలో మోడీ ఏం అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

కేంద్రం లేని సెస్సులు ఎందుకు పెంచుతుంది.. మేం పెట్రోల్ ధరలు ఎప్పుడు పెంచామని కేసీఆర్ (kcr) ప్రశ్నించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ‌లో జరగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో (trs plenary) ఆయన మాట్లాడుతూ.. కరోనాపై మీటింగ్ పెట్టి రాష్ట్రాలు ట్యాక్స్‌లు (tax) తగ్గించాలని మోడీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.  ఇదేం పద్ధతి.. ప్రధాని మాట్లాడే మాటలేనా అని కేసీఆర్ ఫైరయ్యారు. ప్రధాని మోడీ (narendra modi) డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారంటూ దుయ్యబట్టారు. ఏ నోటితో రాష్ట్రాలను తగ్గించాలని అడుగుతారని ఆయన ఫైరయ్యారు. మీరెందుకు పెట్రోల్ , డీజిల్‌పై సెస్ పెంచారని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ పెంచలేదని సీఎం పేర్కొన్నారు. 

ఆర్టీసీని (tsrtc) అమ్మాలని ప్రధాని మోడీ ఆఫర్ పెట్టారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్ర పెద్దలేనని.. ఆర్టీసీని అమ్మే  రాష్ట్రాలు వెయ్యి కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారంట అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. పొద్దున లేస్తే మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. మనిషి కోసం మతమా..? మతం కోసం మనిషా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి మతాన్ని వాడతారా అని సీఎం నిలదీశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. ఊరేగింపుల్లో కత్తులు, కటార్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. 

ఎనిమిదేళ్లలో మోడీ ఏం అభివృద్ధి చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ రంగంలో అభివృద్ధి జరిగిందన్న దానిపై ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నులు పెంచేది మీరు.. రాష్ట్రాలు తగ్గించాలా..? ఇదెక్కడి నీతి అని కేసీఆర్ నిలదీశారు. మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. చాలా భయంకరమైన పరిస్ధితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గారూ ఇక మీ ఆటలు సాగవని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యమం ఇంకా చచ్చిపోలేదని.. రాష్ట్రం పక్షాన దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని సీఎం తెలిపారు. 

మనసు పెట్టి చేస్తే అమెరికాను మించిన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వనరులు వుండి.. భారత్ ఆగమైపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనవంతు ప్రయత్నంగా దేశానికి కొత్త ఎజెండా కోసం ఓ సైనికుడిగా ప్రయత్నిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది రాకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో మార్పుకి వెళ్తున్నామని.. దీవించండని పిలుపునిస్తే విరాళాలు అవే వస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ప్రత్యామ్నాయ, అద్భుత రాజకీయ ఎజెండా రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

మూస రాజకీయాలు నడుపుతూ.. దేశాభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఫ్రంటులు, టెంటుల పంథా నుంచి భారతదేశం బయటపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మనదేశంలో టూరిజం ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కలలు కనవచ్చు.. వాటిని సాకారం చేసుకోవచ్చని తెలంగాణ నిరూపించిందని సీఎం అన్నారు. కొత్త రాజకీయ ఎజెండా, కొత్త పంథా దేశ రాజకీయాల్లో రావాల్సి వుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యావత్తు భూముల ధరలు పెరిగాయని.. ముందు ముందు రాష్ట్రంలో భూముల ధరలు మరింత పెరుగుతాయని సీఎం తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?