తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చాకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేసీఆర్ వివరించారుతెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఈ సమయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
తెలంగాణ ఉద్యమం సాగడానికి 58 ఏళ్లు కావడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రు కాదా అని ఆయన ప్రశ్నించారు. 1956లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా లెక్కచేయకుండా ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణను విలీనం చేశారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విలీన సమయంలో ఇచ్చిన హామీలను కూడ విస్మరిస్తుంటే చూస్తూ కూర్చున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు.
undefined
1969 ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోయాయన్నారు. అనేక ఒప్పందాలను కాలరాసినా కాంగ్రెస్ నేతలు ప్రేక్షకపాత్ర పోషించారని ఆయన విమర్శలు చేశారు.1969 తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఉక్కుపాదంతో అణచివేసిందని కేసీఆర్ చెప్పారు.ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారని కేసీఆర్ విమర్శలు చేశారు.
also read:నేడే అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లు: కేసీఆర్ సర్కార్ ప్లాన్
టీడీపీ హయంలో శాసనసభలో తెలంగాణ పదం వాడొద్దని స్పీకర్ అంటే కాంగ్రెస్ నేతలు నోరెత్తలేదన్నారు. కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అనడం, మంత్రి పదవి ఇవ్వగానే దుకాణం మూసేశారన్నారు.కాంగ్రెస్ నేతల వైఖరి వల్ల తెలంగాణ ఉద్యమంపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు సర్కార్ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ కమ్యూనిష్టు పార్టీలు ఉద్యమం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కమ్యూనిష్టుల ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారన్నారు. ఈ సమయంలో తాము కూడ పాల్గొన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
అయితే ఈ అవకాశాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకొనేందుకు కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారని కేసీఆర్ సెటైర్లు వేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణలో పోలింగ్ పూర్తి కాగానే వైఎస్ఆర్ టైమ్ చూసుకొని హైద్రాబాద్ కు వెళ్లాలంటే పాస్ పోర్టు తీసుకోవాలా అని అప్పటి సీఎం రెచ్చగొట్టారన్నారు.సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఎన్నోసార్లు అవమానించారన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడ ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ మంత్రులు నోరెత్తలేదని కేసీఆర్ గుర్తు చేశారు.ఈ విషయాలకు సంబంధించిన వీడియోలున్నాయన్నారు.
.కాంగ్రెస్ నేతలా తమకు నీతులు చెప్పేది అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయమై కూడ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు. తనకు పిండం పెడతారని విమర్శలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రకమైన చర్యలు తీసుకోవడం తమకు చేతకాదా అని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
.
.