ఆ గొడవ టీడీపీ-వైసీపీకి కాదు.. చంద్రబాబు-పోలీసులకు మధ్యే, నక్క ముదిరితే సింహం కాదు : అంబటి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 06, 2023, 03:03 PM ISTUpdated : Aug 06, 2023, 03:07 PM IST
ఆ గొడవ టీడీపీ-వైసీపీకి కాదు.. చంద్రబాబు-పోలీసులకు మధ్యే, నక్క ముదిరితే సింహం కాదు : అంబటి వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై మరోసారి విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.  తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, కానీ నక్క ముదిరితే సింహంలా ఎలా మారుతుందని అంబటి సెటైర్లు వేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై మరోసారి విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో జరిగిన గొడవ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య కాదని.. పోలీసులు, చంద్రబాబు మధ్య జరిగిన గొడవ అన్నారు. షెడ్యూల్ ప్రకారం రూట్‌ మ్యాప్‌లో వెళ్లి వుంటే ఏ గొడవా జరిగేది కాదని, కానీ అనుమతి లేని చోట చంద్రబాబు రచ్చ చేయాలని అనుకున్నారని ఆరోపించారు. 

పథకం ప్రకారమే శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నం చేశారని అంబటి దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు శాంతి, విపక్షంలో వున్నప్పుడు అశాంతి కోరుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. తాను సింహాన్నని చంద్రబాబు అంటున్నారని.. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, కానీ నక్క ముదిరితే సింహంలా ఎలా మారుతుందని అంబటి సెటైర్లు వేశారు. 

ALso Read: పుంగనూరు విధ్వంసం.. గెలిచే సత్తా లేక దాడులు, ఆయన చిప్ మార్చుకోవాలి : చంద్రబాబుపై వైసీపీ నేతల ఆగ్రహం

ఇదే సమావేశంలో పవన్ కల్యాణ్‌పైనా రాంబాబు విమర్శలు గుప్పించారు. బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందని, ఈ సినిమాకు కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయని మంత్రి తెలిపారు. తన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పలేని వ్యక్తి.. రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తారు అని రాంబాబు ప్రశ్నించారు. తనపై మరో సినిమాకు ప్లాన్ చేశారని.. అది వచ్చాక తాను కూడా ఓ సినిమా తీస్తానని చెప్పారు. బ్రోలో తన గురించే ఆ సీన్ పెట్టారు కాబట్టి.. ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?