రాహుల్‌ పుట్టుకపై వ్యాఖ్యలు.. అహంకారమా, కళ్లు నెత్తికెక్కాయా: అస్సాం సీఎం బర్తరఫ్‌కు కేసీఆర్ డిమాండ్

Siva Kodati |  
Published : Feb 12, 2022, 05:38 PM ISTUpdated : Feb 12, 2022, 05:43 PM IST
రాహుల్‌ పుట్టుకపై వ్యాఖ్యలు.. అహంకారమా, కళ్లు నెత్తికెక్కాయా: అస్సాం సీఎం బర్తరఫ్‌కు కేసీఆర్ డిమాండ్

సారాంశం

రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అస్సాం సీఎంను మోడీ బర్తరఫ్ చేయాలని.. రాహుల్‌ను ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేసీఆర్. ఆ మాటలు వింటేననే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని.. ఇదా మన సంప్రదాయం మోడీ.. నడ్డా సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అలా దిగజారి మాట్లాడవచ్చా అని తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ప్రశ్నించారు. అహంకారమా..? కళ్లు నెత్తికెక్కాయా.. అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం సీఎంను మోడీ బర్తరఫ్ చేయాలని.. రాహుల్‌ను ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేసీఆర్. ఆ మాటలు వింటేననే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని.. ఇదా మన సంప్రదాయం మోడీ.. నడ్డా సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని కోరారు. 

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని స్థీరికరించడానికి రైతుబంధు ఉపయోగపడిందని చెప్పారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా భువనగిరిని జిల్లాగా చేసుకున్నామని సీఎం గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో భువనగిరి ప్రజలు బెబ్బులిలా పోరాటం చేశారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ వచ్చాక కరెంట్ కష్టాలన్నీ తీరాయని.. 24 గంటలూ అన్ని రంగాలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణానే అని సీఎం చెప్పారు. 

తలసరి కరెంట్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ అని కేసీఆర్ గుర్తుచేశారు. తలసరి ఆదాయం సహా అన్ని విషయాల్లో దేశంలోనే ఆదర్శంగా ఉన్నామని.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్నామని సీఎం తెలిపారు. ఏడేళ్ల క్రితం భూముల ధర ఎలా వుంది.. ఇప్పుడు ఎలా వుందని కేసీఆర్ ప్రశ్నించారు. భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. కొద్దిరోజుల్లోనే కాళేశ్వరం జలాలు వస్తాయని సీఎం చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నదని కేసీఆర్ ఆరోపించారు. 

మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదరుతోందని.. మోడీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చిందంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రైతుల్ని ఏడిపించారని.. రైతుల్ని అవమానించారని, గుర్రాలతో తొక్కించారని సీఎం ఎద్దేవా చేశారు. చివరికి రైతుల మీదకి కార్లు కూడా ఎక్కించారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం ఆరోపించారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమంటోందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. 

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్ని నాశనం చేసిందని.. బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి న్యాయం చేయలేదని కేసీఆర్ మండిపడ్డారు. సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారంటూ కేసీఆర్ సంగతి మండిపడ్డారు. తెలంగాణకు ఎందుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. మతతత్వ బీజేపీ వుంటే, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు. నరేంద్రమోడీ సిగ్గుపడాలని.. కర్ణాటకలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని కేసీఆర్ గుర్తుచేశారు. సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్ధుల మీద దాడులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు