ఉద్యోగాలపై పిచ్చి మాటలొద్దు.. 95 శాతం స్థానికులకే: జోనల్ వ్యవస్థపై కేసీఆర్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 12, 2022, 03:46 PM IST
ఉద్యోగాలపై పిచ్చి మాటలొద్దు.. 95 శాతం స్థానికులకే: జోనల్ వ్యవస్థపై కేసీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

ఉద్యోగాలపై కొందరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రమోషన్ల  కోసం ఉద్యోగులు పైరవీలు చేసే పరిస్ధితి వుండకూడదని.. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే నినాదం మనదని కేసీఆర్ గుర్తుచేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు సీఎం కేసీఆర్ (kcr). శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని (yadadri bhongir collectorate) ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడా ఎకరం భూమి రూ.25 లక్షలకు తక్కువగా లేదన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంచిర్యాలను జిల్లా చేస్తామన్నారని.. కానీ కుదరలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 

భూముల రేట్లు వట్టిగనే పెరగలేదని.. తెలంగాణ వచ్చాకే ఇది జరిగిందని సీఎం తెలిపారు. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందని.. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను నాశనం చేశారని.. వాటర్ షెడ్డింగ్‌తో భూగర్భ జలాలు పెరిగాయని సీఎం తెలిపారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని..  95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చెప్పారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో వుందని కేసీఆర్ తెలిపారు. పుట్టిన దగ్గరి నుంచి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. దేశం ఓ పక్క వెనక్కి పోతున్నా.. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందన్నారు. ప్రమోషన్ల  కోసం ఉద్యోగులు పైరవీలు చేసే పరిస్ధితి వుండకూడదని.. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే నినాదం మనదని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 కలెక్టరేట్‌లకు ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తోన్న భువనగిరికి చెందిన ఉషా రెడ్డిని ముఖ్యమంత్రి అందరికీ పరిచయం చేశారు. 

కాగా.. శుక్రవారం జనగామలో జరిగిన టీఆర్ఎస్ (trs) బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్ధలు కొడతామని.. ఖబడ్దార్ మోడీ అంటూ సీఎం హెచ్చరించారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దేశం నుంచి నిన్ను తరిమేస్తామని.. మాకిచ్చే వాళ్లని తెచ్చుకుంటామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మా జోలికి వస్తే నాశనం చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ (narendra modi) జాగ్రత్త.. నీ ఊడుత ఊపులకు భయపడమన్నారు. 

నీళ్ల కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొట్లాడుతుంటాడని అన్నారు కేసీఆర్. జనగామలో మంచినీళ్ల బాధ.. కరెంట్ బాధ పోయిందని కేసీఆర్ గుర్తుచేశారు. జనగామ జిల్లాకు ఖచ్చితంగా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని.. త్వరలోనే జీవో విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు, స్టెబిలైజర్లు మాయమయ్యాయని.. గతంలో బచ్చనన్నపేట చూస్తేప బాధగా అనిపించేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక బచ్చన్నపేట బతుకు మారిందన్నారు. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తున్నామని.. ఏడాదికి రెండు మూడు లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలోని 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందుతుందని సీఎం హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లలో ఏనాడు కేంద్రంతో పంచాయతీ పెట్టుకోలేదని కేసీఆర్ గుర్తుచేశారు. అక్కడి నుంచి ఏం రాకున్నా వున్నంతలో అవినీతిరహితంగా ఒక పద్ధతిగా వెళ్తున్నామన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే